అమరావతి : అరెస్టుకు చంద్రబాబు అతీతుడా ?

Vijaya

అడ్డుగోలుగా వాదించటంలో చంద్రబాబునాయుడు ఆరితేరిపోయారు. తనను విచారించటానికి వచ్చిన అధికారులను లేదా సంస్ధలపై నోరేసుకుని పడిపోతారు. తనను విచారించే అర్హత మీకుందా ? మీ విచారణ పరిధి ఏమిటి ? తనను విచారించేంత స్ధాయి ఉందా అంటు తాను మాజీ ముఖ్యమంత్రినని మరచిపోవద్దు అంటు నానా రచ్చ చేస్తారు. ఇపుడు కూడా చంద్రబాబు ఇలాంటి అడ్డుగోలు వాదనే వినిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తాను ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వణికిపోతోందన్నారు. ప్రజాసమస్యలను తనను పోరాటం చేయకుండా ప్రభుత్వం అరెస్టుచేసిందన్నారు.





నిజానికి ప్రభుత్వం ఇపుడు చంద్రబాబును అరెస్టుచేసింది ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని కాదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపేరుతో వందల కోట్లరూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మాత్రమే. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు పాత్ర కీలకమని సీఐడీ అరెస్టుచేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కారణంగానే అరెస్టుచేసినట్లు కలరింగిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడటానికి అవినీతి ఆరోపణలపై అరెస్టు అవటానికి తేడా లేదా ?





కానీ చంద్రబాబు మాత్రం అడ్డుగులోగా వాదిస్తునే ఉంటారు. పైగా తనపైన కేసులు పెట్టడానికి ప్రభుత్వానికి ఎంత ధైర్యమంటు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రిగా పనిచేసినంత మాత్రాన చంద్రబాబుపై కేసులు పెట్టకూడదని ఎక్కడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులుగా ఉన్నపుడే లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, శిబుసోరేన్లు అరెస్టయ్యారని చంద్రబాబు మరచిపోయారు. రాజ్యంగంలో వాళ్ళకి లేని రక్షణ చంద్రబాబుకు ఎక్కడి నుండి వచ్చిందో అర్ధంకావటంలేదు. అవినీతి ఆరోపణలపై ఎంతోమంది కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు అరెస్టయిన విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.





తప్పుచేస్తే శిక్షపడుతుందన్న ప్రాధమిక విషయాన్ని చంద్రబాబు అంగీకరించటంలేదు. ఎంతసేపు తన అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమనే అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. నిజంగానే తన అరెస్టు అన్యాయమైతే అదే విషయాన్ని కోర్టులో నిరూపించుకుని బయటపడవచ్చు. కానీ కోర్టు విచారణలో నిరూపించుకోవటం అన్నది చంద్రబాబు చాలా చిన్నతనంగా భావిస్తున్నట్లున్నారు. అందుకనే అసలు తనపై కేసులు ఉండకూడదని, తనపై విచారణ జరగకూడదని, విచారణ జరిగినా అరెస్టు చేయకూడదని చంద్రబాబు అనుకుంటుంటారు. అంటే తాను రాజ్యాంగం, చట్టానికి అతీతుడనని అనుకోవటం వల్లే ఈ సమస్య వస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: