ప్రేమ వివాహలపై.. ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. పెద్దలు ఒప్పుకుంటేనే?
ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఎక్కువగా ప్రేమ పెళ్లిల్లే కనిపిస్తూ ఉన్నాయి. అయితే యువతి యువకుల మధ్య ప్రేమ పుట్టడం కామన్ అయితే ఇలా ప్రేమించుకున్న వారు కొన్నిసార్లు పెళ్లి అనే బంధంతో తమ ప్రేమకు ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రేమ విషయం పెద్దలకు చెబుతారు. కానీ కొంతమంది పెద్దలు మాత్రం పెళ్లికి అంగీకరించరు. దీంతో ఎలాగైనా తమ ప్రేమను గెలిపించుకోవాలని పెద్దలను ఎదిరించి.. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్న వారు నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దీంతో కని పెంచిన తల్లిదండ్రులకు పిల్లల తీరుతో బాధ మిగులుతుంది అని చెప్పాలి.
అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా అంటే లవర్స్ విషయంలో ప్రభుత్వం ఎందుకు వస్తుంది అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఒక రాష్ట్ర ప్రభుత్వం లవర్స్ కి షాక్ ఇచ్చేలా ఒక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే ప్రేమ వివాహాలు చేసుకునేలా ఒక వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. ఓ వర్గం వినతి మేరకు ఈ ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుందుకు ఎంతోమంది యువతి యువకులు ఇంట్లో నుంచి పారిపోతున్నారని.. అయితే ఈ విషయంపై అధ్యయనం జరిపి ఇక ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకారం తప్పనిసరి అనే నిబంధన తీసుకువస్తాం అంటూ చెప్పుకోవచ్చారు.