బెంగుళూరు : బీజేపీకి వ్యతిరేకంగా కొత్త కూటమి ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించేందుకు కొత్త కూటమి తెరపైకి రాబోతోన్నట్లు సమాచారం. ఇపుడు జాతీయస్ధాయిలో రెండు కూటములన్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ. అయితే యూపీఏ నాయకత్వంలో ఎన్డీయేని ఓడించటం సాధ్యంకావటంలేదు. అందుకనే మరికొన్ని కొత్తపార్టీలను కూడా చేర్చుకోవాలని ప్రతిపక్షాల్లోని కీలక నేతలు అనుకున్నారు. ఇందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నడుంకట్టారు.






నిజానికి బీజేపీని ఓడించాలని యూపీఏతో పాటు చాలా ప్రతిపక్షలకు ఆలోచన ఉన్నా దానికి ఒక షేపు రాలేదు. ఈ నేపధ్యంలోనే నితీష్ కుమార్ కాస్త గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే యూపీఏలోని పార్టీలతో ఇతర ప్రతిపక్షాలు కూడా పాట్నాలో భేటీ అయ్యాయి. ఇపుడు రెండో సమావేశం కోసం బెంగుళూరుకు చేరుకున్నాయి. యూపీఏని వదిలేస్తే ఇతర ప్రతిపక్షాల్లో ముఖ్యమైనవి ఆప్, ఎస్సీ, ఎన్సీపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ. వీటన్నింటినీ యూపీఏలో భాగస్వామ్యం తీసుకోమంటే కుదరదని అంటున్నాయట.





అందుకనే యూపీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలను కలుపుకుని కొత్త కూటమిని ఏర్పాటు చేసే విషయంపై అన్నీ పార్టీలు సానుకూలంగా స్పందించాయట. 17, 18 తేదీల్లో అందరు  కూర్చుని కొత్త అలయన్స్ అంటే కూటమికి ఒక పేరు డిసైడ్ చేయబోతున్నారు. 17,18 తేదీల భేటీకి సుమారు 24 పార్టీల అధినేతలు సమావేశమవుతున్నారు. కొందరు 17 వ తేదీ బెంగుళూరు చేరుకుంటే మరికొందరు 18వ తేదీ వస్తున్నారు.





ఏదేమైనా తొందరలోనే యూపీఏ స్ధానంలో మరో కొత్త కూటమి ఏర్పాటు కావటానికి బెంగుళూరు సమావేశం నాంది పలుకుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్ధిని పోటీలోకి దింపాలంటే అన్నీపార్టీలు త్యాగాలకు సిద్ధపడక తప్పదు. తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో తామే పోటీచేస్తామంటే కుదరదు. కొన్నిసీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించాల్సిందే. అప్పుడే ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపగలవు, గెలుపుకు కష్టపడతాయి. మరి కొత్త కూటమి పేరు ఏమిటనే విషయంలో ఆసక్తిగా పెరిగిపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: