గోదావరి : పవన్ బండారాన్ని డైరెక్టర్ బయటపెట్టారా ?

Vijaya


తూర్పుగోదావరి జిల్లాలో వారాహియాత్ర పూర్తిచేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సడెన్ గా యాత్రకు బ్రేక్ ఇఛ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సభలో కూడా మాట్లాడారు. వెంటనే పవన్ కు జ్వరం వచ్చిందని అందుకనే రెస్ట్ తీసుకోవటం కోసం రెండురోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారట. 30వ తేదీ నుండి యాత్ర కంటిన్యు అవుతుందని 27 రాత్రి జనసేన అధికారికంగా ట్విట్టర్లో  ప్రకటించింది.





సరే కంటిన్యుగా తిరుగుతున్నారు, అందులోను మండిపోయే ఎండలు కాబట్టి ఏదైనా అనారోగ్యం చేసుంటుదేమో అని అనుకున్నారు అందరు. కానీ కానీ 28వ తేదీ మధ్యాహ్నం 1.36 గంటలకు బ్రో సినిమా దర్శకుడు సముద్రఖని రెండు ఫొటోలు, 5 సెకన్ల వీడియో బిట్ ను ట్విట్టర్లో పోస్టుచేశారు. ఫొటోల్లో ఎక్కడా పవన్ కు అనారోగ్యం జాడలే కనబడలేదు. అలాగే 5 సెకన్ల వీడియోలో ఎవరో ల్యాప్ టాపులో ఏదో చూపిస్తే పవన్ పడిపడి నవ్వారు. నిజంగానే పవన్ కు జ్వరం లేదా తీవ్రమైన అనారోగ్యం చేసుంటే అంతలా పడిపడి నవ్వే ఛాన్సేలేదు.





ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ నటిస్తున్న సినిమా బ్రో టీజర్ 29న విడదుల కావాలట. టీజర్ కు సంబంధించిన పవన్ డబ్బింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. పవన్ ఎప్పుడొచ్చి డబ్బింగ్ చెప్పాలి ? టీజర్ ఎప్పుడు విడుదల చేయాలి. అందుకనే మొబైల్ డబ్బింగ్ యూనిట్ నే సముద్రఖని పవన్ కు దగ్గరకు తీసుకెళ్ళారు. అందులోనే డబ్బింగ్,  రికార్డింగ్  ఫెసిలిటీ అన్నీ ఉన్నాయట. కేవలం పవన్ కోసమే ఈ ఏర్పాట్లు చేసినట్లి తెలిసింది.




యాత్ర జరుగుతున్నపుడు  మధ్యలో ఉన్నపుడు టీజర్ కు డబ్బింగ్ చెప్పించటం బాగోదని చెప్పి పవన్ తో మాట్లాడిన తర్వాతే మొబైల్ యూనిట్ ను తీసుకెళ్ళారు. డబ్బింగ్ కోసమనే  పవన్ అనారోగ్యంపేరుతో రెండురోజులు బ్రేక్ ఇచ్చారు.  మొబైల్ యూనిట్లో కూర్చుని 28వ తేదీన పవన్ డబ్బింగ్ పార్ట్ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. ఏకంగా టీజర్ రిలీజ్ చూసుకుని 30 తెల్లవారి మళ్ళీ భీమవరంలో యాత్ర మొదలుపెడతారు.  సముద్రఖని రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియో బిట్ వల్లే పవన్ కు ఎలాంటి అనారోగ్యం లేదన్న విషయం బయటపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: