అమరావతి : జగన్ పై యుద్ధంలో క్లారిటి ఉందా ?

Vijaya


తొందరలో జరగబోయే ఎన్నికల యుద్ధంలో మూడుపార్టీల అధినేతలు మంచి దూకుడుమీద వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు రాబోయే కురుక్షేత్రంలో వైసీపీనే గెలవాలని, జనాలంతా ఓట్లేసి మళ్ళీ గెలిపించమని కోరారు. తర్వాత పార్టీ నేతల సమీక్షలో చంద్రబాబునాయుడు మాట్లాడుతు యుద్ధం మొదలైపోయిందని చెప్పారు. వారాహియాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంటే ముగ్గరు కూడా జరగబోయే యుద్ధానికి రెడీగానే ఉన్నట్లు అర్ధమైపోతోంది. అయితే ఇక్కడే కొంచెం క్లారిటి మిస్సయినట్లుంది.





తాను ఎవరితో యుద్ధంచేయాల్సుంటుందనే విషయంలో జగన్లో మంచి క్లారిటి ఉంది. అందుకనే చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాను మారీచ, సుభాహులతొ పోల్చుతు రాక్షసులతో మనకు యుద్ధం తప్పదని చెబుతన్నది. మరి చంద్రబాబులో కూడా క్లారిటి ఉందా ? జగన్ తో యుద్ధం తప్పదని చెబుతున్నారు ? అయితే ఆ యుద్ధం ఒంటరిగానా లేకపోతే పొత్తులతోనా అన్నదే తేల్చుకోలేకపోతున్నారు. ఒంటరిగా జగన్ తో  యుద్ధంచేసేంత సీన్ లేదని చంద్రబాబే చెప్పారు.





ఇక పవన్ విషయం చూస్తే జగన్ తో ఒంటరి యుద్ధంచేస్తే వీరమరణం తప్పదని ఒప్పేసుకున్నారు. అందుకనే పొత్తులుపెట్టుకుని మిత్రపక్షాలతో కలిసి యుద్ధం చేయాలని అనుకుంటున్నారు. అయితే తనలోని అయోమయం కారణంగా తాను గందరగోళంలో పడుతు పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్న పార్టీని కూడా గందరగోళంలో పడేస్తున్నారు. దానివల్ల పొత్తులు పెట్టుకున్నా ఉపయోగముంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ బలం సున్నా మాత్రమే. అంటే జగన్ తో యుద్ధంలో బీజేపీ బలం ఎందుకూ ఉపయోగపడదు.





అలాగని బలంలేదు కాబట్టి బీజేపీని వదిలేయలేకపోతున్నారు. బీజేపీ లేకుండా జనసేనతో పొత్తుపెట్టుకునేందుకు చంద్రబాబు వెనకాడుతున్నారు. అందుకనే జగన్ తో చేయబోయే యుద్ధంలో ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు ? ఎవరు ఒంటరిగా యుద్ధంచేస్తారనే క్లారిటి వీళ్ళల్లో మిస్సయిపోతోంది. జగన్ మీద యుద్ధంచేయటానికి బీజేపీ తమకు ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానం కూడా చంద్రబాబులో పెరిగిపోతోందని సమాచారం. ఒకవైపు రాష్ట్రానికి నిదులిస్తు, అప్పులకు వెసులుబాటు కల్పిస్తు మళ్ళీ జగన్ ది అవినీతి, అరాచక ప్రభుత్వమని కేంద్రమంత్రులు ఆరోపించటం వల్లే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ యుద్ధం చేసే విషయంలో జగన్ ప్రత్యర్ధుల్లో ఎవరికి క్లారిటి ఉన్నట్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: