అమరావతి : బస్సుయాత్రలతో సీనేంటో తేలిపోతుందా ?

Vijaya


రాజమండ్రి మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన మొదటి విడత మ్యానిఫెస్టోకు ప్రచారం కల్పించటంకోసం సోమవారం నుండి బస్సుయాత్రలు మొదలవుతోంది. చంద్రబాబు మ్యానిఫెస్టోను ప్రకటించి మూడువారాలైంది. అయితే దానిపై జనాల్లో పెద్దగా సానుకూలత కనబడలేదు. ఎందుకంటే మ్యానిఫెస్టో మొత్తం వివిధ పార్టీల నుండి కాపీకొట్టి వాటికే కొత్తపేర్లను తగిలించారనే ప్రచారం పెరిగిపోయింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలను, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న పథకానికి, తెలంగాణాలో కేసీయార్ అమలుచేస్తున్న పథకాన్నే కాపీకొట్టేసి చంద్రబాబు మ్యానిఫెస్టోను ప్రకటించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.





పైగా ఇప్పుడు ప్రకటించిన హామీల్లో కొన్నింటిని 2014లో ప్రకటించినవే. కాకపోతే అప్పుడు పేర్లు వేరు ఇపుడు పేర్లు వేరంతే. అప్పట్లో రైతుల రుణమాఫీ అంటే ఇపుడు రైతులకు ఏడాదికి రు. 20 వేలన్నారు. అప్పట్లో మహిళలకు ఏడాదికి 12 సిలిండర్లంటే ఇపుడు 3 సిలిండర్లన్నారు. అప్పుడు నిరుద్యోగభృతి రు. 1500 అనిచెప్పారు. దాన్నే ఇపుడు రు. 3 వేలన్నారు. అయితే అప్పట్లో ఏ ఒక్కహామీని సంపూర్ణంగా నెరవేర్చలేదు. అందుకనే తాజా హామీలపై జనాల్లో నెగిటివ్ చర్చలు జరుగుతున్నాయి.





తాజా మ్యానిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు ఈరోజు నుండి బస్సుయాత్రలను మొదలుపెడుతున్నారు. 125 నియోజకవర్గాల్లో 5 బస్సుల్లో సీనియర్ నేతలు ప్రచారంచేస్తారు. 30 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ప్రదానంగా గ్రామీణ ప్రాంతాలనే టచ్ చేయబోతున్నారు. రోడ్డుసైడ్ మీటింగులు, పల్లెనిద్ర లాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యానిఫెస్టోను వివరించటంతో పాటు లోకల్ సమస్యలను కూడా ఎక్కువగా ప్రస్తావించాలని చంద్రబాబు ఆదేశించారు.





ఈ యాత్రలు చేస్తునే పబ్లిక్ పల్స్ ఎలాగుందో తెలుసుకోవటం కూడా కీలకమైనదనే చెప్పాలి. పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం కూడా బస్సుయాత్రలను ఫాలో అవుతారని, ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారని పార్టీవర్గాలు చెప్పాయి. యాత్రల సందర్భంగా ఎలాంటి అంశాలను తమ్ముళ్ళు టచ్ చేయాలనే విషయాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో విస్తృస్ధాయి సమావేశం జరగబోతోంది. ఎప్పటికప్పుడు యాత్రల ద్వారా జనాభిప్రాయం తెలుసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా పార్టీ ఆఫీసులో చేశారు. మరి యాత్ర ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: