అమరావతి : చంద్రబాబుతో బీజేపీ ఆడుకుంటోందా ?

Vijaya


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడిమేరకు రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులను మంజూరుచేస్తోంది. జగన్ అడిగినపుడల్లా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్లు ఇస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి వెళ్ళిన ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం వీలైనంత ప్రయారిటి ఇస్తోంది.  ఈ విషయాలన్నీ ఎల్లోమీడియా ఏడుపులోనే స్పష్టమైపోతోంది. పోలవరం మొదటిదశ నిర్మాణంపూర్తిచేసేందుకు అడ్ హాక్ నిధులుగా రు. 12,911 కోట్లను మంజూరుచేసింది.నిధుల సమస్యతో ఇబ్బందులు పడుతున్న పోలవరంకు ఒకేసారి సుమారు 13 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయటమంటే మామూలు విషయంకాదు. పైగా ఇప్పటివరకు చేసిన ఖర్చులకు సంబంధించిన రీఎంబర్స్ మెంట్ ను కూడా చేస్తామని చెప్పింది. 2013-14 సవరించిన అంచనాలతో కాకుండా తాజా అంచనాల ప్రకారమే నిధులు మంజూరుచేయటానికి కేంద్రం అంగీకరించింది. అంతేకాకుండా బిల్లుల చెల్లింపులో పరిమితులను కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమధ్యనే రెవిన్యులోటు రు. 10, 411 కోట్లను విడుదలచేసింది.అంటే జరుగుతున్నది చూస్తుంటే జగన్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం ఫుల్లు సపోర్టుచేస్తున్నట్లే ఉంది. మరిదే సమయంలో చంద్రబాబునాయుడును అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని 50 నిముషాలు మాట్లాడారు. గడచిన ఐదేళ్ళుగా ఎంత ప్రయత్నించినా దొరకని అమిత్ షా అపాయిట్మెంట్ సడెన్ గా ఇప్పుడే చంద్రబాబుకు ఎందుకు దొరికిందన్నది ప్రశ్న. తెలంగాణాలో టీడీపీ మద్దతును అమిత్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.అంటే ఒకవైపు జగన్ తో మంచి సంబంధాలు మెయిన్ టైన్ చేస్తునే మరోవైపు తెలంగాణాలో బీజేపీకి చంద్రబాబు మద్దతు కోరటమంటే ఏమనుకోవాలి ? జగన్-చంద్రబాబు బద్ధశతృవులన్న విషయం అమిత్ షా కు తెలీదా ? తెలంగాణాలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మరి ఏపీలో కూడా పొత్తు తప్పదుకదా. జగన్ అడిగిన ప్రాజెక్టులకు అనుమతిలిస్తు, భారీఎత్తున నిధులను మంజూరు చేస్తుంటే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ఏమి మాట్లాడగలరు ? కేంద్ర వైఖరిపైన చంద్రబాబు, టీడీపీ బయటపడటంలేదు కానీ వాళ్ళేడుపు ఎల్లోమీడియా రాతల్లో అర్ధమైపోతోంది.  ఇందుకనే  చంద్రబాబుతో బీజేపీ ఆడుకుంటున్నట్లు అనుమానంగా ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: