అమరావతి : రేపటి స్లోగన్ డిసైడ్ అయిపోయిందా ?

Vijaya




రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అండ్ కో ను దెబ్బకొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి స్లోగన్ను రెడీ చేసుకున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ కొత్తస్లోగన్ ఏమిటంటే పేదలు-పెత్తందార్ల మధ్య యుద్ధం. ఈ స్లోగన్నే ఇపుడు జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా పదేపదే వినిపిస్తున్నారు. తన స్లోగన్ కు తగ్గట్లే పార్టీ పెద్ద పోస్టర్ ను కూడా డిజైన్ చేసింది. పోస్టర్లో పెత్తందార్లుగా జగన్ అభివర్ణిస్తున్న చంద్రబాబునాయుడు, లోకేష్ పల్లకిలో కూర్చునుంటారు.



పోస్టర్లో ఒకవైపు వీళ్ళు కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎల్లోమీడియా యాజమాన్యాలతో పాటు మరికొందరు మోస్తుంటారు. వీళ్ళపక్కనే ఉన్న కొందరు పోస్టర్లో మరోవైపున్న పేదలపై రాళ్ళు వేస్తుంటారు. పెత్తందార్లు విసురుతున్న రాళ్ళు పేదలకు తగలకుండా వాళ్ళకి ముందు జైగాంటిక్ పర్సనాలిటీతో జగన్ కూర్చునుంటారు. అంటే పెత్తందార్లు విసిరే రాళ్ళదెబ్బలన్నింటినీ పేదలకు తగలకుండా మధ్యలో జగనే కాపుకాస్తుంటారని అర్ధం.



పార్టీ డిజైన్ చేసిన ఈ పోస్టర్ బాగా పాపులరైంది. దీన్ని తణుకు లాంటి మరికొన్ని నియోజకవర్గాల్లో పెద్ద హోర్డింగుల్లోకి ఎక్కించి ముఖ్యమైన జంక్షన్లలో ఏర్పాటుచేస్తున్నారు. దాంతో జనాలంతా ఈ హోర్డింగులను ఆసక్తిగా గమనిస్తున్నారు. జగన్ కు కావాల్సింది కూడా జనాలు ఎటెన్షనే అన్న విషయం తెలిసిందే. తాను చెబుతున్న పేదలు-పెత్తందార్ల కాన్సెప్టును జనాలు చర్చించుకోవటమే జగన్ కు కావాల్సింది.



జగన్ అనుకున్నదే ఇపుడు జరుగుతోంది. అమరావతి ప్రాంతంలో మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో  ఒకేసారి 51వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ జరిగిన తర్వాత జగన్ కాన్సెప్టుపై జనాల్లో మరింత చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో స్లోగన్లే పార్టీకి పెద్ద బూస్టప్ ఇస్తాయన్న విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లో బైబై బాబు అనే స్లోగన్ బ్రహ్మాండంగా వర్కవుటైంది. మరి జగన్ తాజా స్లోగన్ కు చంద్రబాబు అండ్ కో విరుగుడుగా ఎలాంటి స్లోగన్ తీసుకొస్తుందో గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: