పార్లమెంటులో అమరావతి.. అసలు కథ ఇదీ?

Chakravarthi Kalyan
నూతన పార్లమెంట్ లో కొన్ని చారిత్రక స్థలాలు, వాటి డిజైన్లను ఏర్పాట్లు చేశారు. వివిధ కళలకు సంబంధించిన వాటి గురించి ప్రొజెక్టు చేశారు. వివిధ నృత్య కళలు, చాణక్య నీతి తెలిపే వివరాలు ఇలా ఎన్నో రకాలుగా భారత సంస్కృతికి ఉట్టి పడే విధంగా నూతన పార్లమెంట్ లో అన్ని విధాల తీర్చి దిద్దారు. దేశ ఔన్యత్యాన్ని చాటే గొప్ప కట్టడంగా మలిచారు. అందులో అమరావతి నగరం కళ కూడా ఉంది.

అయితే గతంలో ధరణి కోట రాజధానిగా అమరావతి ఉండేది. కొన్నిచోట్ల క్యాపిటల్స్ పేరు పెట్టారు. మరి కొన్నిచోట్ల కోటల పేర్లు పెట్టారు. పార్లమెంట్ భవనంలో అమరావతి అమరేంద్ర స్వామి క్షేత్రం గా పేరుపొందింది. అంతే కాదు  బౌద్ధ మతం గురించి అమరావతి లో ఎక్కువగా వివరించబడింది. నగరాలు ప్రాంతాలు, చారిత్రక సాంస్కృతిక నిలయాలు కాబట్టి అన్నింటిని నూతన పార్లమెంట్ భవనంలో వాటి గుర్తులు తెలిపేలా వివిధ రూపాలను చిత్రీకరించారు.

చోళ, పాండ్య, కళింగ రాజ్యాలు ఉన్నప్పుడు మాత్రం అమరావతి అనే నగరం లేకపోవచ్చు. కానీ ధాన్య కటకం అనేది ఉండేది. శాత వాహన శకం లో అమరావతి అనేది ఉండొచ్చు అనేది తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి మహారాష్ట్రలో ఒక ప్రాంతంగా ఉంది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాజీ చంద్రబాబు ప్రకటించారు.

అమరావతి పేరుతో విశ్వ నగరంగా మారుస్తామని అన్నారు. అయితే నూతన పార్లమెంటు భవనంలో భారత చారిత్రక, సనాతన, పూర్వ వైభవం ఉట్టి పడేలా చేసిన అన్ని కళా రూపాలు ఎంతో మెరిసిపోతూ వాటి గొప్ప దనాన్ని చాటుతున్నాయి. పార్లమెంటు ప్రారంభానికి కొన్ని ప్రతిపక్షాలు రాకపోయినా ప్రధాని మోదీ మాత్రం సెంగోల్ ను తిరిగి పున:స్థాపించి నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. పార్లమెంటులో జాతీయ చారిత్రక అంశాలు ప్రవేశపెట్టడం  ఒక మంచి అంశమేనని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: