ఢిల్లీ : అవినాష్ ను ఫుట్ బాల్ ఆడుకుంటున్న కోర్టులు

Vijaya




హైకోర్టు-సుప్రింకోర్టు. తర్వాత హైకోర్టు వెకేషన్ బెంచ్ మళ్ళీ సుప్రింకోర్టు వెకేషన్ బెంచ్. తాజాగా మళ్ళీ హైకోర్టు వెకేష్ బెంచ్. ఇదంతా ఏమిటంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్టే కోసం వేసిన పిటీషన్ ను హైకోర్టు-సుప్రింకోర్టంటు న్యాయస్ధానాలు ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయి. ఈ కోర్టుకు వెళితే పై కోర్టుకు వెళ్ళమంటారు. పై కోర్టులో కేసువేస్తే కిందకోర్టులోనే తేల్చుకోమంటున్నారు. ఇదంతా చూసిన వాళ్ళకి ఎంపీని న్యాయస్ధానాలు ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయని అనుకోవటంలో తప్పనిపించటంలేదు.



వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీని విచారణకు రావాల్సిందే అని సీబీఐ నోటీసుల మీద నోటీసులిస్తోంది. విచారణకు హాజరైతే తనను అరెస్టుచేస్తారని ఎంపీకి అనుమానం ఉన్నట్లుంది. తల్లి అనారోగ్యంగా ఉందికాబట్టి విచారణను నాలుగురోజులు వాయిదా వేయటమన్నారు. దానికి సీబీఐ ఏమీ చెప్పలేదు. అందుకనే బెయిల్ కావాలని సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ప్రస్తుతం న్యాయస్ధానాలకు సెలవుల కారణంగా కేవలం వెకేషన్ బెంచ్ మాత్రమే పనిచేస్తోంది. వెంకేషన్ బెంచ్ లో స్టే కోనం పిటీషన్ వేస్తే రెగ్యులర్ కోర్టుకు వెళ్ళమని చెప్పింది. రెగ్యులర్ కోర్టులో పిటీషన్ వేస్తే కేసును విచారించిన ధర్మాసనం హైకోర్టు వెకేషన్ బెంచ్ లోనే తేల్చుకోమని చెప్పింది.



హైకోర్టు వెకేషన్ బెంచ్ లోనే తేల్చుకోమని ఆదేశించిన కోర్టు విచిత్రమైన వ్యాఖ్యలు చూడా చేసింది. స్టే కావాలని అడిగే హక్కు పిటీసనర్ కు ఉందని చెప్పింది. అలాగే నిందుతుడు లేదా అనుమానితుడిని అరెస్టుచేసే అధికారం సీబీఐకి ఉందని చెప్పింది. మరి దీని అర్దమేంటో తెలీటంలేదు.



సుప్రింకోర్టు తాజా ఆదేశాల ప్రకారం అవినాష్ కేసు హైకోర్టు వెకేషన్ బెంచ్ లో ఈనెల 25వ తేదీన విచారణకు రాబోతోంది. న్యాయస్ధానాల వైఖరిచూస్తుంటే ఎంపీని ఫుట్ బాల్ ఆడుకుంటున్నట్లే అనిపిస్తోంది. ఇస్తే స్టే ఇచ్చేయాలి లేదా స్టే ఇవ్వటం సాధ్యంకాదని కేసు కొట్టేయచ్చు. అప్పుడు ఎంపీని ఏమిచేయాలనేది సీబీఐ ఇష్టం. కానీ కోర్టులు అలా చెప్పటంలేదు. పై కోర్టని, కిందకోర్టని తిప్పుతున్నాయి. ఒకవైపు అవినాష్ అరెస్టు విషయంలో ఎల్లోమీడియా వెంటాడుతోంది. ఇంకోవైపు బెయిల్ విషయంలో ఎంపీని ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయి. మొత్తానికి ఎంపీ విషయంలో ఎప్పటికి  క్లారిటివస్తుందో అర్ధంకావటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: