కుదరదు.. ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన నాటో దేశాలు?
అయితే దీన్ని జర్మనీ, హంగేరీ లాంటి ఎనిమిది దేశాలు ఆయన ప్రకటనను తోసిపుచ్చాయి. మిగతా వారు సైలెంట్ గా ఉన్నారు. ఒక సారి నాటోలో చేర్చుకుంటే నాటో నిబంధనల ప్రకారం.. ఏ నాటో దేశం మీద ఇతర దేశాలు యుద్దం చేస్తే అన్ని కలిపి ఏకపక్షంగా శత్రు దేశంపై దాడి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాతో పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు గనక ఉక్రెెయిన్ ను నాటో చేర్చుకుంటే 31 దేశాలు రష్యాతో యుద్దం చేయాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం చేయాలని, ఆర్థికంగా కుదేలు కావాలని ఏ దేశం అనుకోవడం లేదు. అందుకే వెనకంజ వేస్తున్నాయి. ఈ రెండు దేశాల యుద్దం మధ్య యూరప్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం ముంచుకోస్తుంది.
ఓవైపు ఉద్యోగాలు పోతున్నాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇలా చాలా వరకు నష్టం జరిగిపోయింది. అయితే నాటో భాగస్వామి అయినటువంటి దేశాలు నాటో సెక్రటరీ జనరల్ జెమ్స్ స్టోలెన్ బర్గ్ చెప్పిన విషయంపై.. యూరోపియన్ యూనియన్ పారన్ పాలనీ హెడ్ జోసెప్ బోరెల్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కు మిలటరీ పరంగా సాయం చేస్తాం. కానీ నాటోలో చేర్చుకోవడం కరెక్టు కాదని అన్నారు. నాటో లో ఉక్రెయిన్ చేరికపై ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో చూడాలి.