అమరావతి : చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడిందా ?

Vijaya





ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు డబుల్ గేమ్ బయపడిపోయినట్లుంది. నాలుగు గోడల మధ్య తమ్ముళ్ళతో మాట్లాడేది ఒక మాట. బయటకు వచ్చి బహిరంగసభల్లో చెప్పేది మరోమాట. బుధవారం హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో జరిగిన ప్రతినిధుల  మాట్లాడుతు పేదరికం పోవాలంటే అవకాశం ఉన్న ధనవంతులు, మేథావులు, ఉన్నతస్ధాయి వ్యక్తులంతా తలా పది పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపిచ్చారు. పది పేదకుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ బాగోగులు చూస్తు ఆర్ధికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పేదల దత్తత విషయంలో జనాలకు పిలుపిచ్చారు కానీ తాను ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటున్నది మాత్రం చెప్పలేదు. పార్టీలోని కొన్ని వందలమంది ప్రముఖులున్నారు. వాళ్ళలో ఎవరెవరు ఎన్నెన్ని కుటుంబాలను దత్తత తీసుకోబోతున్నారో మాత్రం ప్రకటించలేదు. అంటే దత్తత అన్న కొత్త స్కీమ్ కేవలం బయటజనాలకే కానీ తనకు, తన వాళ్ళకు కాదన్నట్లుగా అర్ధమవుతోంది. నిజంగానే పేదలను దత్తత తీసుకుని అభివృద్ధిలోకి తీసుకొచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఆ విషయాన్ని సభలోనే ప్రకటించుండేవారు.



విచిత్రం ఏమిటంటే దత్తత కార్యక్రమాన్ని టీడీపీ అధికారంలోకి రాగానే ఒక ఉద్యమం లాగ చేపడతారట. పేదల కుటుంబాలను దత్తత తీసుకోవటానికి అధికారంలోకి రావటానికి ఏమిటి సంబంధం ? టీడీపీ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు ఎవరినీ దత్తత తీసుకోరా ? పేదల దత్తత ప్రోగ్రామ్ ప్రకటించిన చంద్రబాబుకు అక్కరలేకపోతే ఇక మిగిలిన జనాలకు ఏముంటుంది ? ఒకవేళ అధికారంలోకి వస్తే పేదలకు ఇపుడు అందుతున్న సంక్షేమ ఫలాలు ఆపేస్తామన్నట్లుగానే అర్ధమవుతోంది.



ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నపుడు మళ్ళీ ఎవరో కొన్ని పేదల కుటుంబాలను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది ? అంటే సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపేసి దత్తత పథకం ఒక్కటే అమలు చేయబోతున్నట్లు పరోక్షంగా చెప్పటమే. మళ్ళీ తమ్ముళ్ళతో పార్టీ ఆఫీసులో మాట్లాడుతు టీడీపీ అధికారంలోకి రాగానే ఇప్పటికన్నా సంక్షేమ పథకాలు మరింతగా అమలు చేస్తామని చెప్పారు. కానీ బయట సభలో మాత్రం ఆ మాట ప్రస్తావించకుండా పేదల దత్తత పథకాన్ని మాత్రమే ప్రకటించారు. దీంతోనే చంద్రబాబు డబుల్ గేమ్ అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: