ఆగని కుక్కల దాడి.. మరో చిన్నారిపై ఎటాక్?

Purushottham Vinay
మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కాలంలో వీధి కుక్కలు ఒక రేంజిలో రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా అవి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా దాడి చేస్తున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ ని అత్యంత కిరాతకంగా వీధి కుక్కలు దాడి చేసి దారుణంగా చంపాయి.ఈ విషాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో కలచివేశాయి. ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం అప్పటికప్పుడు  చర్యలు తీసుకుంటున్నా కూడా విధి కుక్కల బెడద మాత్రం ఇంకా తప్పట్లేదు.ఇక తాజాగా ఖమ్మంలో ఇలాంటి మరో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా కల్లూరి పట్ణంలో సోమలింగాలరెడ్డి వీధిలో శీలం నాగరాజు దంపతుల కుమార్తె కారుణ్యపై వీధి కుక్కలు చాలా దాడి చేశాయి. పాపం ఆ పాప వయసు కేవలం నాలుగు సంవత్సరాలు. ఇంటి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వీధి కుక్కలు పాప కారుణ్యపై దాడి చేసి కరిచాయి.


దీంతో ఆ పాపకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తమ పట్టణంలో వీధి కుక్కల బెడద బాగా పెరిగిపోతుందని..అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇక ఇదిలా ఉంటే.. గ్రేటర్ వరంగల్ లోని కాశీబుగ్గ లో ఓ విద్యార్థిని నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ కూడా వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఆ బాలిక భయంతో పరుగులు తీయడంతో ఆ కుక్కల నుంచి ప్రమాదం తప్పిందని అంటున్నారు.ఇక బాలికను ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎండాకాలం కావడంతో అధిక ఉష్ట్రోగ్రతని తట్టుకోలేక కొన్ని కుక్కలు పిచ్చిగా మారి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పపడుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అందుకే చిన్న పిల్లలు స్కూళ్లకు పంపాలన్నా భయం వేస్తుందని తల్లిదండ్రులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: