అమరావతి : తాజా ఫలితాలతో టీడీపీ రెచ్చిపోతోందా ?

Vijaya


చాలాకాలం తర్వాత వచ్చిన గెలుపు కదా అందుకనే టీడీపీ రెచ్చిపోతోంది. 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బనుండి టీడీపీ కోలుకోలేదు. ఆ ఎన్నికల తర్వాత స్ధానికసంస్ధల ఎన్నికలను కూడా వైసీపీ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన మూడు ఉఫఎన్నికల్లో కూడా వైసీపీదే గెలుపు. ఎన్నిక ఏదైనా గెలుపు అధికారపార్టీదే అన్నట్లుంది పరిస్ధితి. ఇలాంటి సమయంలో రెండు ఎంఎల్సీ స్ధానాల్లో టీడీపీ గెలిచిందంటే నిజంగా గొప్ప విజయమనే చెప్పాలి. కాకపోతే టీడీపీ చెప్పుకుంటున్నట్లుగా కాదు.



ఎందుకంటే రెండు ఎంఎల్సీ స్ధానాల్లో గెలుపు బాటలో ఉందో లేదో (దాదాపు గెలిచినట్లే) వెంటనే జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని గోల మొదలుపెట్టేసింది. ప్రజలంతా తిరుగుబాటు చేశారట, ప్రభుత్వం మీద తమలోని వ్యతిరేకతను ప్రజలు ఎంఎల్సీ ఎన్నికల్లో చూపించారని నానా రచ్చ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ బ్రహ్మాండమైన మెజారిటితో అధికారంలోకి వచ్చేస్తుందనటానికి ఈ ఎంఎల్సీ ఎన్నికలే నిదర్శనమని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ట ఏదేదో మాట్లాడుతున్నారు.



14 ఎంఎల్సీ  స్ధానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ 12 చోట్ల గెలిస్తే టీడీపీ గెలిచింది 2 సీట్లలో మాత్రమే. గెలిచింది రెండు సీట్లలోనే అయినా టీడీపీకి బూస్టప్ ఇచ్చేదే అనటంలో సందేహంలేదు. కానీ 2 చోట్ల గెలిచినంత మాత్రాన 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని తమ్ముళ్ళు  అనుకుంటే బోర్లా పడినట్లే. ఇదే సమయంలో రెండుచోట్ల ఎందుకు ఓడిపోయిందో వైసీపీ నిజాయితీగా పోస్టుమార్టమ్ చేసుకోవాల్సిందే.



ఇక్కడ గమనించాల్సిందేమంటే టీచర్లలో జగన్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందని జరిగిన ప్రచారానికి వచ్చిన ఫలితం భిన్నంగా ఉంది. రెండు టీచర్ల నియోజకవర్గాల్లోను వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. ఇదేసమయంలో మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలను గెలుచుకుంటామని అధికారపార్టీ అనుకున్నా రెండింటిలో ఓడి ఒకటి మాత్రం గెలిచింది. ఫలితాల సరళిని చూస్తుంటే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల ఓవర్ కాన్ఫిడెన్సు వల్లే గెలుస్తామనుకున్న స్ధానాల్లో  వైసీపీ ఓడిపోయినట్లుంది. అన్నీస్ధానాల్లోను గెలవాలన్న పట్టుదల జగన్ లో తప్ప మంత్రులు, ఎంఎల్ఏల్లో ఉన్నట్లు లేదు. మరి ఇదే ట్రెండ్ కంటిన్యు అయితే....



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: