అమరావతి : టీడీపీది మరీ ఇంత శాడిజమా ?

Vijaya



తెలుగుదేశంపార్టీ శాడిజమంతా బయటపడుతోందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎంఎల్సీ కోటాలో ఏడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం భర్తీ అవ్వబోయే ఏడు స్ధానాలు వైసీపీకే దక్కుతాయి. అయితే ఏడుస్ధానాలు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో పడటాన్ని చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే టీడీపీ తరపున అభ్యర్ధులను పోటీపెట్టాలని అనుకుంటున్నారట.



అయితే ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ పెట్టాల్సిందే అని తమ్ముళ్ళు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. పోటీగురించి చంద్రబాబు ఆలోచించినా లేకపోతే తమ్ముళ్ళు ఒత్తిడి తెచ్చినా టీడీపీ ఒక్క సీటును కూడా గెలుచుకునే అవకాశంలేదు. అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎంఎల్ఏల బలముంది. అలాగే టీడీపీ తరపున 23 మంది గెలిచారు. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో నలుగురు ఎంఎల్ఏలు టీడీపీకి దూరమైపోయారు. అంటే టీడీపీ నికరబలం 19 మాత్రమే.



ఇదే సమయంలో వైసీపీలో ఇద్దరు ఎంఎల్ఏలు పార్టీకి దూరమైపోయారు. అంటే వైసీపీ నికరబలం 149. అయితే టీడీపీకి దూరమైన నలుగురు ఎంఎల్ఏలు+జనసేన ఎంఎల్ఏ వైసీపీతో ఉంటున్నారు. అంటే వైసీపీ బలం 149+5= 154 అయ్యింది. ఒక ఎంఎల్సీని గెలుచుకోవాలంటే 22 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి.  ఈ లెక్కన వైసీపీ ఖాతాలోనే ఏడు ఎంఎల్సీలు పడిపోతాయి. ఎంఎల్ఏల లెక్కప్రకారం చూస్తే టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని అర్ధమైపోతోంది.



వాస్తవం ఇలాగుంటే టీడీపీ పంచుమర్తి అనూరాధను పోటీచేయించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వైసీపీకి ఏడు సీట్లు ఏకగ్రీవమవ్వటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శాడిజంకొద్దీ పోటీకి రెడీ అవుతోందంతే. గతంలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇలాగే వర్లరామయ్యను పోటీలోకి దింపి పరువు పోగొట్టుకుంది. ఇపుడు కూడా అదే సీన్ రిపీటవ్వటం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అయినా సరే పోటీకి రెడీ అవుతోందంటే ఫక్తు శాడిజం కాక మరేమిటి ? స్ధానికసంస్ధల్లో భర్తీ అవబోయే తొమ్మిది స్ధానాల విషయంలో కూడా టీడీపీ ఇలాగే వ్యవహరించింది. మరిపుడు ఎంఎల్ఏల కోటా ఎంఎల్సీలు ఎలా భర్తీ అవుతాయో చూడాల్సిందే.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: