గోదావరి : జోగయ్య అసలు ప్లాన్ ఇదేనా ?

Vijaya


కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య చేసిన డిమాండ్ విచిత్రంగా ఉంది.  వైసీపీ తరపున ఎంపికైన ఎంఎల్సీల విషయమై ఆయన మాట్లాడతు జనాభా రీత్యా కాపులకు మూడు ఎంఎల్సీ పదవులు దక్కాల్సుంటే జగన్ కేవలం ఒకటే ఇచ్చారట. జనాభా పరంగా కాపులకు దక్కాల్సిన పదవులు దక్కాల్సిందే అని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే జనాభా రీత్యా కాపులకు ఇన్ని పదవులు ఇచ్చితీరాలని ఎక్కడా లేదు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నోరెత్తలేకపోయినా జోగయ్య డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.



ఎన్నికల్లో ఓట్లను దృష్టిలో పెట్టుకుని సామాజికన్యాయం పేరుతో పార్టీలు పదవులు కేటాయిస్తుంటాయి. అలాంటపుడు హెచ్చుతగ్గులుండటం సహజం. తాజాగా ఎంపిక చేసిన 18 మంది ఎంఎల్సీ అభ్యర్ధుల్లో కాపు సామాజికవర్గం నుండి ఒక్కరికే ఇచ్చారన్నది జోగయ్య బాధ. విచిత్రం ఏమిటంటే కాపులంతా వచ్చేఎన్నికల్లో వైసీపీకి ఓట్లేయద్దని బహిరంగంగా పిలుపునిస్తున్నది ఇదే జోగయ్య. ఒకవైపు ఓట్లేయద్దని పిలుపిస్తు మరోవైపు తమకు దక్కాల్సిన పదవులు దక్కలేదని గోలచేయటంలో అర్ధమేంటి ?



ఏ సామాజికవర్గానికి ఎన్నిపదవులు కేటాయించాలన్నది పూర్తిగా జగన్ ఇష్టం. శాసనమండలిలో ఇప్పటికే ఎంఎల్సీలుగా విక్రాంత్, ఉదయభాస్కర్, తోట త్రిమూర్తులు, సీ రామచంద్రయ్య ఉన్నారు. కాబట్టి తాజా ఎంపికలో ఒకరు చాలని అనుకునుండచ్చు. మైనారిటీల విషయంలో జగన్ ఇలాగే ఆలోచించారు. ఇఫ్పటికే నలుగురున్న కారణంగా తాజా ఎంపికల్లో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని జగన్ స్పష్టంగా చెప్పారు.



కాబట్టి కాపుల విషయంలో కూడా ఇలాగే ఆలోచించుంటారు. ఇంతోటిదానికి జోగయ్య రెచ్చిపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు వైసీపీకి ఓట్లే వేయద్దన్న పెద్దమనిషి కాపులకు జగన్ అన్యాయం చేశారని ఎలా చెబుతున్నారో ? చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా కాపులను పెద్దగా పట్టించుకోకపోయినా ఈ పెద్దమనిషికి అన్యాయం చేసినట్లు అనిపించలేదు. ఉన్నంతలో ఇపుడు జగన్ సర్దుబాటు చేస్తే అన్యాయమని గోల చేస్తున్నారు.  తాజా పరిణామాలను అడ్డంపెట్టుకుని కాపులను వైసీపీకి వ్యతిరేకం చేయటానికి జోగయ్య ప్లాన్ చేస్తున్నట్లున్నారు. మరెంతమంది జోగయ్యకు మద్దతుగా నిలబడతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: