వైసీపీపై ఉన్న వ్యతిరేకత వలనే కోటంరెడ్డి పార్టీ మారాడా ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ లో నెమ్మదిగా ఒక్కో నాయకుడు ఇతర పార్టీలలోకి వెళ్ళడానికి ప్రణాళికలు చేసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలకు దగ్గర పడుతోంది. అయినా చెప్పుకోవడానికి పెద్ద పరిశ్రమలు రాలేదు, రాష్ట్ర రాజధాని ఇంకా ఖరారు కాలేదు, రాష్ట్ర విభజనకు సంబంధించిన చాలా అంశాలు క్లియర్ కాలేదు. అయినా కూడా కోట్లాది మంది జనం సీఎం జగన్ ను గెండెల్లో పెట్టుకుని చూస్తున్నారు. దీనికి కారణం ప్రతి పేదింటికి అవసరం అయిన సంక్షేమాన్ని అందిస్తూ వారికి ఉపయోగపడే పధకాలను అందిస్తున్నాడు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పధకాలు అందే లాగా పాలనను కొనసాగిస్తున్నాడు.
అయితే దీనిని సరిగా అర్ధం చేసుకున్న వారు జగన్ కు మద్దతుగా నిలబడుతుండగా , జగన్ అంటే పట్టని వారు మాత్రం అభివృద్ధి , రాజధాని నిర్మాణం మరియు పోలవరం ప్రాజెక్టుల లాంటివి జరగలేదన్న పేరుతో విమర్శిస్తూ వస్తున్నారు. సీఎంగా తొలిసారి ఎంపిక అయిన జగన్ కు ఇవన్నీ పూర్తి స్థాయిలో చేయడానికి ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. ఆ విధంగా కొంతమందిలో వ్యతిరేకత నెలకొన్న మాట వాస్తవమే. అయితే ఈ వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికలలో జగన్ ఓడిపోవడం జరుగుతుందా అన్న విషయం ఇప్పుడే నిరాదరించడం ఎవరితరం కాదు.
కానీ ప్రస్తుతం వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని కొందరు అధికారిక ఎమ్మెల్యే లు వచ్చే ఎన్నికలల్లో అధికారంలోకి రావడం కష్టం అని భావించి ఇతర పార్టీలలోకి జంప్ చేయడానికి కారణాలను వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే నెల్లూరు రురల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నా ఫోన్ ను ట్యాపింగ్ చేశారు అన్న కారణాన్ని చూపుతూ పార్టీనుండి వెళ్ళిపోతున్నట్లు చెప్పారు. మరి కోటంరెడ్డి కూడా వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవడం అసాధ్యం అని అనుకుని టీడీపీలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ అయిందా లేదా అన్న విషయాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: