జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు జోక్యం ?

VAMSI
ఏపీలో 2019 ఎన్నికల ఫలితాల అనంతరం దారుణంగా టీడీపీ విలువ పడిపోయింది అని చెప్పాలి. వైసీపీ పాలనలో సంక్షేమం తప్ప మరే అద్భుతం జరగకపోవడంతో రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ పై ప్రజలలో మెల్ల మెల్లగా వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకతను చంద్రబాబు ఉపయోగించుకుని వచ్చే ఎన్నికలలో జగన్ ను ఓడించడానికి అవసరం అయిన అన్ని వ్యూహాలను వాడుతున్నాడు. అందులో భాగంగా ఈ మధ్యన ప్రజలలో బాగా పేరు తెచ్చుకున్న జనసేన పార్టీని వాడుకుని జగన్ ను దెబ్బ తీయడానికి ప్లాన్ చేశాడు. అలా నిన్న పవన్ కళ్యాణ్ మరియు చంరబాబులు పొత్తుకు సంబంధించిన భేటీలో పాల్గొన్నారు.

ఇప్పటికి అనధికారికంగా 2024 ఎన్నికల్లో టీడీపీ మరియు జనసేనలు వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఈ పొత్తులో ఎన్నో కీలక విషయాలను ఇద్దరూ కూర్చుని చర్చించుకుని ఫైనల్ చేసుకోవాల్సి వస్తుంది. 175 స్థానాలలో టీడీపీ మరియు జనసేన లు ఏ రేషియోలో పంచుకుంటారు ? నియోజకవర్గం వారీగా సీట్లను ఎవరెవరికి కేటాయించాలి ? అన్న సవాళ్లు చంద్రబాబు పవన్ ల ముందు ఉన్నాయి. ఇక తాజాగా రాజకీయ వర్గాల నుండి తెలుస్తున్న గుసగుసల ప్రకారం జనసేన ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు జోక్యం చేసుకుంటున్నారట.

చంద్రబాబు నియోజకవర్గాల వారీగా ప్రజలలో సత్తా ఉన్న నాయకులను ఎంపిక చేసే దిశగా అడుగులు వేస్తున్నారట. ఇక పవన్ కూడా చంద్రబాబు రాజకీయ అనుభవం మరియు మేధస్సును వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. మరి జనసేన తరపున ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారు అన్నది చూడాలి. ఇక జనసేనలో కొందరు నాయకులు చంద్రబాబు జోక్యాన్ని తట్టుకోలేకున్నారని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించుకుంటూ ఎన్నికలకు వెళ్లడం పవన్ కు పెద్ద సవాలుతో కూడుకున్న పని. ముందు ముందు ఈ రెండు పార్టీల కూటమి వలన ఎన్ని సమస్యలు రానున్నాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: