"టీడీపీ - బీజేపీ" పొత్తు... కేసీఆర్ కు భారీ షాక్ తప్పదా ?

VAMSI
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో తెలంగాణ లో ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా అప్పట్లో ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ , వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. కానీ వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ ఆజ్ఞతో ప్రత్యేక తెలంగాణ బిల్లును తీసుకువచ్చారు. ఆనాడు ఈ ప్రత్యేక తెలంగాను వ్యతిరేకించిన వారిలో చంద్రబాబు నాయుడు ప్రదముడు అని చెప్పాలి. ఆ తర్వాత జరిగిన మార్పుల గురించి , కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నాశనం అయిపోయిన తీరు గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పటికీ తెలంగాణ వలన ఏపీ ఎంతగానో నష్టపోయింది. రాష్ట్ర విభజన చట్టం క్రింద అటు కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు తెలంగాణ నుండి మనకు రావాల్సిన చాలా పెండింగులు ఉన్నాయి. ఇక కేసీఆర్ గత రెండు పర్యాయాలుగా సీఎంగా కొనసాగుతూ మూడవసారి కూడా గద్దెనెక్కడానికి సిద్ధపడుతున్నాడు. అయితే ఇప్పుడు తెలంగాణలో తెరాస కు పోటీ ఇవ్వగల దమ్మున్న పార్టీ బీజేపీ అని రాజకీయ ప్రముఖులు అంటున్న మాట.  అందుకే మోదీ నేతృత్వంలోని బీజేపీ ఈసారి కేసీఆర్ ను సీఎం పదవికి దూరం చెయ్యాలని భారీ ప్లాన్ లో ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణలో కూలిపోయిన టీడీపీని మళ్ళీ లేవనెత్తి దాని ద్వారా కేసీఆర్ ను దెబ్బ తీయాలన్న మాస్టర్ ప్లాన్ లో బీజేపీ ఉంది.
ఆ ప్లాన్ లో ఒక పార్ట్ మొన్న చంద్రబాబు నాయుడు ఖమ్మం లో భారీ బహిరంగ సభ పెట్టడం.. మరియు తెలంగాణ టీడీపీలో ఉంది వివిధ పార్టీలలోకి వెళ్ళిపోయినా వారందరినీ తిరిగి రమ్మని అడగడం. ఈ సభ తర్వాత తెరాస లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ మొదటి స్టెప్ సక్సెస్ అని చెప్పాలి. ఇది ఇలాగే జరిగి టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఖచ్చితంగా వెనక్కు తగ్గే అవకాశాలు ఉంటాయి. మరి చూద్దాం ర్నాఉన్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారుతాయో ?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: