కేసీఆర్ అందుకే ఆ పథకాన్ని ప్రవేశపెట్టారా?

Satvika
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అందిస్తున్నారు..ఒకవైపు ప్రతిపక్షాల వ్యతిరేకత వున్నా కూడా ఇలాంటి కొత్త పథకాలను ఎన్నో తీసుకు వచ్చాయి.ఇక గర్భిణీస్త్రీలకు ప్రత్యేక పథకాలను సైతం తీసుకువస్తోంది ప్రభుత్వం. తాజాగా మాతా శిశు సంరక్షణ పథకానికి పెద్దపీట వేసింది. ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ పథకం సైతం విజయవంతంగా అమలవుతోంది. ఇప్పుడు న్యూట్రిషన్‌ కిట్లకు రపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. రక్తహీనత అధికంగా ఉన్న జిల్లాలపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఈ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి హరరీష్‌రావు కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌ పద్దతిలో ప్రారంభించనున్నారు.మిగిలిన  8 జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ న్యూట్రిషన్‌ కిట్లు 1.25 లక్షల మంది గర్భిణులకు ఉపయోగపడనుందని అంచనా. మొత్తం 2.5 లక్షల కిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఈ కిట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి..రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు చాలా మంది ఉన్నారు. దీని వల్ల వారి ప్రసవాలు ఇబ్బందికరంగా మారింది. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలను పూర్తిగా తగ్గింవచ్చన్నది అధ్యయనాలు చెబుతుండటంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మాత శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా మాతృ మరణాలు తగ్గించడంలో విజయవంతమైంది. ఇప్పుడు ఈ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ పథకాన్ని తీసుకువచ్చింది. మాతృ మరణాల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.పూర్తిగా ఆ సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం ఆలొచిస్తుంది.. కొమురంభీం జిల్లాలో 83 శాతం గర్బిణులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.. పిల్లల కోసం కూడా ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: