ఏపీ, తెలంగాణ లో గత కొన్ని రోజులుగా వాతావరణం లో అనేక మార్పులు కలుగుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిస్తే.. మరో వైపు తీవ్ర మైన చలి వణికిస్తుంది. పొగ మంచుతో మొదలైయ్యే వాతావరణం, మధ్యాహ్నాని కి కాస్తంత వెచ్చగా ఉంటుందని, రాత్రికి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాయని అంచనా వేశారు. ఈ వారం చివర్లో అంటే ఈ శనివారం, ఆదివారాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇకపోతే..అరేబియా సముద్రం లో వాయు గుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమ గాలుల ప్రభావం ఉంటుంద ని తెలిపారు. దీనివల్ల ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.. ఇది రానున్న 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది.
కాగా ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రత లు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉండే చాన్స్ ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల ను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.. వర్షాలు, మంచు కూడా జనాల ను ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది..