హైదరాబాద్ : ఎంపీ కూడా జంపేనా ?

Vijaya


ముందేమో తమ్ముడు కాంగ్రెస్ పార్టీ నుండి జంపయిపోయారు. ఇపుడు అన్న వంతు వచ్చిందా ? అనే సందేహం పెరిగిపోతోంది. ఇంతకీ అన్నదమ్ములెవరో ఈపాటికే తెలిసిపోయుండాలి. అవును కోమటిరెడ్డి బ్రదర్స్ గురించే ఇదంతా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రితో శుక్రవారం భేటీ అవుతున్నారు. మూసీనది ప్రక్షాళనకు రు. 3400 కోట్లు కేటాయించాలని ఎంపీ అడగబోతున్నారు. గంగానది ప్రక్షాళనకు కేంద్రం నిధులిచ్చినట్లే మూసీనది ప్రక్షాళనకు కూడా నిధులివ్వాలని ఎంపీ అడగుతారని ప్రచారం. 




మూసీనది ప్రక్షాళన, నిధుల కేటాయింపుకు రిక్వెస్టులు అనేది పైకి కనిపించే వ్యవహారం. మరి లోగుట్టు ఏమిటి ? ఇపుడు దీనిపైనే చర్చలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కూడా ఇలాగే ఏదో కారణంతో బీజేపీ పెద్దలను కలిసేవారు. తర్వాత హఠాత్తుగా ఎంఎల్ఏ పదవితో పాటు  కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా అన్నారు. తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. అప్పట్లో తమ్ముడి వంతైపోయింది ఇపుడు అన్న మొదలుపెట్టారనే చర్చ పెరిగిపోతోంది.



వెంకటరెడ్డి కూడా చాలారోజులుగా పార్టీతో అంటీముట్టనట్లే ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీని బాగా కంపుచేసేశారు. బీజేపీ తరపున పోటీచేసిన తమ్ముడు రాజగోపాలరెడ్డి గెలుపుకు  కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఓటమికి ప్రత్యక్షంగానే పనిచేశారు. దాంతో అధిష్టానం కూడా బాగా సారియస్ అయి షోకాజ్ నోటీసు కూడా పంపింది. దానికి ఎంపీ ఏమి సమాధానం ఇచ్చారో తెలీదు.



అప్పటినుండే పార్టీతో గ్యాప్ వచ్చేసింది. ఈమధ్యనే వేసిన కమిటీల్లో ఎంపీకి ఎక్కడా చోటివ్వలేదు. రెండురోజుల క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన ఎంపీ తాజాగా మోడీతో భేటీ సంచలనంగా మారింది. ఎంపీ కూడా ఏదోరోజు పార్టీ మారిపోతారనే ప్రచారం ఇపుడు ఊపందుకుంది. వెంకటరెడ్డి వ్యవహారం చూస్తుంటే తొందరలోనే బీజేపీలోకి జంప్ అయ్యేట్లే ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ లోనే ఇమడలేని నేతలెవరూ ఇతర పార్టీల్లో ఎక్కువరోజులుండలేరు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న స్వేచ్చ వాళ్ళకి ఇంకెక్కడా దొరకదు కాబట్టే.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: