అమరావతి : చంద్రబాబు భవిష్యత్తు తేల్చేసిన దగ్గరి బందువు
ఇదేసమయంలో చంద్రబాబును ఎంతవీలైతే అంత దూరంగా బీజేపీ ఉంచుతోంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు, టీడీపీ భవిష్యత్తుపై పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. బాదుడేబాదుడు కార్యక్రమం, ఇదేం ఖర్మ..రాష్ట్రానికి అనే కార్యక్రమాల్లో చంద్రబాబు బాగా బిజీగా రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మీద జనాలకు నమ్మకంపోయిందని బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది.
టీడీపీ వ్యవహారాలపైన, రాజకీయంగా తెలుగుదేశంపార్టీ ప్రస్తుత పరిస్ధితి మీద బీజేపీ నేత బాగా స్టడీ చేసినట్లే ఉన్నారు. స్టడీ చేయించకపోతే టీడీపీకి భవిష్యత్తు లేదని చంద్రబాబు, లోకేష్ ను జనాలు నమ్మటంలేదని ఇంతగట్టిగా ఎలాచెప్పగలరు ? ఏదేమైనా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఆమెచేసిన వ్యాఖ్యలు ఎలాగున్నాయంటే టీడీపీలో ఉంటే భవిష్యత్తులేదు కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది తమ్ముళ్ళు పార్టీని వదిలేసి బీజేపీలో చేరండని పిలుపిచ్చినట్లే అనుమానంగా ఉంది.
ఎందుకంటే బీజేపీకి అర్జంటుగా అభ్యర్ధులు కావాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే పోటీచేయటానికి బీజేపీ తరపున సుమారు 150 నియోజకవర్గాల్లో గట్టిఅభ్యర్ధులే లేరనేది అతిశయోక్తికాదు. పోయినఎన్నికల్లో కూడా ఏదో పోటీచేశామంటే పోటీచేశామనిపించుకున్నారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ఎవరికీ డిపాజిట్టు కూడా రాలేదు. రేపటి ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చేసుకుటుందని కాదు కాబట్టే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వదలకుండా పట్టుకున్నది. కనీసం పవన్ ద్వారా అయినా డిపాజిట్లు తెచ్చుకోవాలన్నది బీజేపీ ఆలోచనలాగుంది.