పోస్టాఫీస్ లో బెస్ట్ స్కీమ్ లు..వాటి వివరాలు..

Satvika
పొదుపు పథకాలు ఎక్కువగా పోస్టాఫీస్ అందిస్తుంది. ఇందులో ఎన్నో పథకాలు మంచి రాబడిని ఇస్తున్నాయి..ఎటువంటి పథకాలు లో ఇన్వెస్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఆలస్యం లేకుండా తెలుసుకుందాం..

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. గతంలో కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడిపై 6.9 శాతం వడ్డీ లభించేది. కానీ ప్రభుత్వం ఇప్పుడు దానిని 7.0 శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఈ పథకంలో పెట్టుబడి మొత్తం 124 నెలల్లో రెట్టింపు అయ్యేది. కానీ ఇప్పుడు ఈ మొత్తం 123 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. రూ. 1000 పెట్టుబడితో ఎవరైనా ఈ పథకం కింద ఖాతాను తెరవవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి అటూ ఏమీ లేదు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన పథకం అని చెప్పొచ్చు. ఈ పోస్టాఫీసు పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు. దీనిని ఐదేళ్లపాటు పొడిగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా.. ఆదాయపు పన్నుపై 80C కింద మినహాయింపు కూడా వస్తుంది..

తమ కుమార్తెల భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కింద, 0 నుండి 10 సంవత్సరాల వరకు ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవడానికి అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడికి ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఈ పథకం కింద మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 నుండి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిపై 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..ఇది నిజంగా మంచి బెనిఫిట్స్ ను ఇస్తుంది..

ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 5.80 శాతం వడ్డీ లభిస్తోంది. మీ సౌలభ్యం ప్రకారం ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పొదుపు పథకంలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఖాతాను తెరవవచ్చు. కనిష్టంగా రూ.100తో ఈ పథకంలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు..ఎక్కువ ప్రజాదరన పొందిన పథకం పొందింది..ఈ పథకాలన్ని కూడా మంచి లాభాలను అందిస్తాయి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: