హైదరాబాద్ : ఫైనల్ గా నిజం ఒప్పుకున్నారా ?

Vijaya





మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజం అంగీకరించారు. ఇంతకీ ఆయన అంగీకరించిన నిజం ఏమిటంటే రాజకీయాల్లో తాను ఫెయిలైనట్లు. సీఏ విద్యార్ధులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతు ఈరోజుకి తానొక ఫెయిల్డ్ పొలిటీషియన్ అని ప్రకటించారు. రాజకీయాల్లో  ఫెయిలైనందుకు తానేమీ బాధపడటంలేదని కూడా అన్నారు. ఓటమి అన్నది గెలుపుకు మెట్లలాంటిది అని చెప్పారు. కాబట్టి సీఏ విద్యార్ధులు కూడా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను, ఫెయిల్యూర్లను చూసి భయపడకూడదని ధైర్యంచెప్పారు.



అంతా బాగానే ఉందికానీ తన ఫెయిల్యూర్లకు కారణం ఏమిటో కూడా చెప్పుంటే బాగుండేది. ఫెయిలయ్యానని అంగీకరించటం ఒక ఎత్తైతే దానికి కారణాలను నిజాయితీగా విశ్లేషించుకోవటం లేదా అంగీకరించటం మరోఎత్తు. పార్టీపెట్టి దాదాపు తొమ్మిదేళ్ళయిన తర్వాత తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అన్న విషయాన్ని పవన్ గ్రహించటమే చాలా గొప్ప విషయం. మరి తన ఫెయిల్యూర్లకు కారణాలను పవన్ ఎప్పుడయినా ఆలోచించారా ? అన్న విషయమై నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.



సరే ఈరోజుకు తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని అంగీకరించారు బాగానే ఉంది మరి భవిష్యత్తు మాటేమిటి ? భవిష్యత్తులో సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అనిపించుకునేందుకు పవన్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అన్న విషయం కూడా చెప్పుంటే బాగుండేది. ఊరికే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పొదిలేస్తే నెటిజన్లు ఊరుకుంటారా ? పవన్ ఫెయిల్యూర్లకు తమకు తోచిన కారణాలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.



పవన్ తాజా ప్రకటనతో మిత్రపక్షం బీజేపీ  ఎలా స్పందిస్తుందో చూడాలి. అసలు అసందర్భంగానే అయినా పవన్ ఎందుకీ ప్రకటన చేశారో అర్ధంకావటంలేదు.  విద్యార్ధుల సమావేశానికి వెళ్ళి వాళ్ళకి నాలుగు బుద్ధులు చెప్పిరాకుండా తన సోదంతా వినిపించారు. సినిమారంగంలో లేదా రాజకీయాల్లో తాను సాధించిన విజయాలు ఏమైనా ఉంటే వాటిగురించి చెప్పుంటే విద్యార్ధులకు స్పూర్తిగా ఉండేది. అంతేకానీ తన ఫెయిల్యూర్లను వాళ్ళకు చెప్పటం వల్ల విద్యార్ధులకు ఎలాంటి ఉపయోగం ఉండదని పవన్ గ్రహించకపోవటమే చాలా ఆశ్చర్యంగా ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: