పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. ఐదేళ్లకు రూ.14 లక్షలు పొందే అవకాశం..

Satvika
పోస్టాఫీస్ లో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లను అందిస్తూ వస్తున్నారు.ఇందులో తక్కువ మొత్తం నుంచి పొదుపు పథకాలు ఉన్నాయి..అందులో కొన్ని స్కీమ్ లు ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి.ఈ స్కీమ్ లలో ఒకటి..పోస్ట్‌ ఆఫీసుల్లో నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికేట్‌ ఒకటి..ఇందులో పెట్టుబడిదారులకు గణనీయమైన రాబడిని త్వరగా అందిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే అధిక పెట్టుబడి పరిమితి లేదు. వినియోగదారులకు మంచి ప్రయోజనాలు అందిస్తున్నాయి. అత్యంత ప్రసిద్ధ పోస్టాఫీసు పథకాలలో ఒకటి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్.


ఈ పథకం కింద పోస్టాఫీసు నుండి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను కొనుగోలు చేయవచ్చు. ఇది చిన్న పోస్టల్ పొదుపు కార్యక్రమం వంటిది. మీ అవసరాలను బట్టి మీరు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కోసం కనీస పెట్టుబడి రూ. 1,000. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. ఇకపోతే తమ జాతీయ పొదుపు ధృవపత్రాలపై పోస్టాఫీసు నుండి 6.8 శాతం వడ్డీ రేటును అందుకుంటారు. గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు మీరు ఈ ప్లాన్‌లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో వడ్డీ వార్షిక ప్రాతిపదికన ఉంటుంది. కానీ మెచ్యూరిటీపై చెల్లించబడుతుంది. ఈ పథకంలో వడ్డీ వార్షిక ప్రాతిపదికన ఉంటుంది. కానీ మెచ్యూరిటీపై చెల్లించబడుతుంది.

ఎన్‌ఎస్‌సీ ప్లాన్‌లో మీరు సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరవవచ్చు. ఉమ్మడి ఖాతాను ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో తెరవవచ్చు. పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు 10 ఏళ్ల పిల్లల ఖాతాపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను రాయితీ సెక్షన్ 80C కింద 1.5 లక్షల పన్ను రాయితీ లభిస్తుందని తెలుస్తుంది. ఈ స్కీమ్ లో ఓ వ్యక్తి రూ.10 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే..6.8 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీరు మెచ్యూరిటీ సమయంలో రూ.14 లక్షలు పొందవచ్చు. అంటే ఐదేళ్లలోనే రూ.4 లక్షల బెనిఫిట్‌ పొందవచ్చు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి ఈ ఖాతాను తెరవవచ్చు. వడ్డీతో కలిపి మొత్తం రూ.14 లక్షల వరకు అందుకోవచ్చు..అంటే మీరు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: