ప్రాణం పోసే మొక్కే.. ఇప్పుడు ప్రాణం తీస్తుందా?

praveen
హరితహారం.. మానవాళి భవిష్యత్తుకు స్వీకారం.. ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణకు ఒక పచ్చటి తోరణం.. ఇవే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్పే మాటలు. కేవలం మాటలు చెప్పి వదిలేయలేదు. హరితహారం కార్యక్రమాన్ని ఒక మహా యజ్ఞం గా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలలో సైతం హరితహారం కార్యక్రమం పకడ్బందీగా జరిగే విధంగా అన్ని రకాల ఆదేశాలను జారీ చేశారు. అందుకు తగిన నిధులను కూడా విడుదల చేశారు.

 ఇక కెసిఆర్ చేపట్టిన మహత్తరమైన హరితహారం అనే కార్యక్రమం పుణ్యమా అని ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా పచ్చడి చెట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక ఎన్నో రకాల చెట్లను ప్రతి ఒక్కరు చేత నాటించి పర్యావరణాన్ని కాపాడాలని అవగాహన కూడా కల్పించారు. Iఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మహా యజ్ఞంలా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలోకి మాత్రం ఒక విషపు మొక్క చేరింది అనేది తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తెలిసి చేసిందా.. తెలియక ఆ మొక్కను నాటుతుందో తెలియదు. కానీ ఇక ఇప్పుడూ ఆ మొక్కతో మానవాళికి ముప్పు వాటినే ప్రమాదం వచ్చేస్తోంది.

 ఇలా హరితహారంలో చేరిన విష గుళిక రాష్ట్ర మొత్తం విస్తరించి పోయింది. ఆ విష గుళిక పేరే కొనోకార్పస్.  ఇక ఈ మొక్క కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అదేంటి పచ్చటి మొక్కలతో ఆక్సిజన్ వస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటే మనిషి ఆయుష్షు మరింత పెరుగుతుంది. కానీ మొక్కలతో ప్రాణాలు పోవడం ఏంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఈ మొక్క కాంబ్రాటేసి  కుటుంబానికి చెందినది. చూడ్డానికి అందంగా ఉన్న ఈ మొక్క మాత్రం ఎందుకు పనికిరాదు.

 సాధారణంగా పశువులు రోడ్లపై ఉండే మొక్కలను తినడం చూస్తూ ఉంటాం. కానీ కోనోకార్పస్ అనే మొక్కను మాత్రం పశువులు వాసన చూడటానికి కూడా ఇష్టపడవు. అంతే కాదండోయ్ ఇక ఈ చెట్టు నీడ పడిన చోట కనీసం పచ్చగడ్డి కూడా మొలవదంటే ఇక ఈ చెట్టు ఎంత డేంజరస్ అర్థం చేసుకోవచ్చు. ఇక అంతే కాదండోయ్ భూమి లోపల ఉండే డ్రైనేజీ వ్యవస్థ, పైపులైన్లను, కేబుల్లను సైతం ఈ మొక్క వేర్లు చీల్చుకుంటూ భూమిలోకి దూసుకుపోతూ ఉంటాయి. ఇక ఏదో తెలియని ఘాటు వాసన ఈ మొక్క నుంచి వస్తూ ఉంటుంది. ఇది పీల్చుకోవడం వల్ల మానవాళికి శ్వాసకోశ సంబంధ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా ప్రాణం పోసే మొక్కే ఇక ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: