అమరావతి : చిరంజీవి చెప్పిన లక్షణాలు పవన్లో ఉన్నాయా ?

Vijaya






తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లున్నారు. ఎంతైనా అన్నయ్య కదా తాను ఫెయిలైన రంగంలో కనీసం తమ్ముడైనా ఉన్నతస్ధాయికి చేరుకోవాలని కోరుకోవటంలో తప్పేలేదు. కానీ ఆ కోరుకోవటంలోనే తన తమ్ముడి గురించి బాగా ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనగురించి చిరంజీవి చెప్పుకున్నది ఒకరకంగా కరెక్టే కానీ తమ్ముడి గురించి చెప్పిన విషయాలే కాస్త తేడాకొడుతోంది.



ఇంతకీ చిరంజీవి తనగురించి చెప్పుకున్నదేమంటే తాను మాటలు పడలేరు, అనలేనరట. రాజకీయాల్లో అన్నింటికీ తెగించిన వాళ్ళే రాణించగలరట. తాను రాజకీయాలకు పనికిరానని ఫైనల్ గా ఒప్పేసుకున్నారు. కానీ తన తమ్ముడు అన్నింటికీ సిద్ధపడ్డారట. తాను మాటలు పడటమే కాకుండా అనగలరట. అందుకనే ఏదోరోజు ఉన్నతస్ధాయికి చేరుకుంటారనే నమ్మకాన్ని చిరంజీవి వ్యక్తంచేశారు. సరే ఇపుడు చిరంజీవి ఫెయిల్యూర్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు.




అయితే పవన్ గురించి చెప్పిన మాటలే తేడాకొడుతున్నాయి. విషయం ఏమిటంటే ప్రత్యర్ధులను పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. అదే తిరిగి వాళ్ళేమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస, అంబటిరాంబాబులపై బహిరంగంగా నోటికొచ్చినట్లు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టిందే పవన్. వెంటనే వాళ్ళు రియాక్టయితే తనను అనరాని మాటలంటున్నారంటు గగ్గోలు పెట్టిందీ పవనే. వాళ్ళని అనటం ఎందుకు వాళ్ళతో అనిపించుకోవటం ఎందుకు ?



ఇక జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే జగన్ రెడ్డిని తాను అసలు ముఖ్యమంత్రిగానే గుర్తించనని చెప్పింది పవనే కదా. సంబంధంలేని విషయాల్లో జగన్ను పిక్చర్లోకి లాగి ఆరోపణలు, విమర్శలు చేసింది పవనే. హైదరాబాద్ లోని షాద్ నగర్లో ఒక అమ్మాయిపై హత్యాచారం చేసి బతికున్నపుడే కాల్చేసిన ఘటనలో జగన్ కు వార్నిగిచ్చిన పెద్దమనిషి పవన్. చంద్రబాబునాయుడు హయాంలో కర్నూలులో సుగాలి ప్రీతి ఒక గిరిజన అమ్మాయి హత్యాచారానికి గురైతే దాన్నీ జగన్ ప్రభుత్వానికే చుట్టేసి నోటికొచ్చింది మాట్లాడారు. దాంతో జగన్ అండ్ కో  పవన్ను దత్తపుత్రుడని, ప్యాకేజీస్టార్ అని మొదలుపెట్టారు. కాబట్టి చిరంజీవి చెప్పిన లక్షణాలు పవన్లో లేవన్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: