అమరావతి : చంద్రబాబుకు ఫ్యూచర్ కనబడుతోందా ?

Vijaya




ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఒక్కసారిగా కాలజ్ఞానం వంటబట్టినట్లే ఉంది. కాలజ్ఞానం అంటే భవిష్యత్తును చెప్పటమే కదా. ఇపుడు చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దాన్నే సూచిస్తున్నాయి. ఎక్కడ మాట్లాడినా పార్టీకి రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలంటు పదేపదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే తెలంగాణాలో చేసినట్లుగా ఏపీలో కూడా  షట్టర్ క్లోజ్ చేసేయటం తప్ప వేరేదారిలేదని డైరెక్టుగా అంగీకరిస్తున్నారు.



తెలంగాణాలో పార్టీని క్లోజ్ చేయలేదు. అలాగని చేస్తున్న యాక్టివిటి కూడా ఏమీలేదు. ట్రస్ట్ భవన్లో కూర్చుని పార్టీ సీనియర్లతో మీటింగులు పెట్టుకుంటున్నారంతే. పార్టీకి పూర్వవైభవం తేవాలని పదిమందితో అనిపించి భేటీని ముగించేస్తున్నారు. ట్రస్ట్ భవన్ దాటి పార్టీచేస్తున్న కార్యక్రమాలేమీ లేవు కాబట్టే పార్టీ తెలంగాణాలో ఎత్తిపోయిందని అనుకుంటున్నారు. ఇపుడు ఏపీ విషయమే తీసుకుంటే ఒకవైపు పార్టీకి 160 సీట్లు గ్యారెంటీ అని చెబుతునే మరోవైపు రాబోయే ఎన్నికలే చివరివి అంటే అర్ధమేంటి ?



గెలుస్తుందనే నమ్మకం లేకపోయినా ఏ అధినేత కూడా పార్టీ ఓడిపోతుందని, గెలవకపోతే పార్టీకి చివరి ఎన్నికలని చెప్పరు. కానీ చంద్రబాబు మాత్రం రోడ్డుషోలో జనాలముందే బహిరంగంగా ప్రకటించారు. దీంతోనే చంద్రబాబులో టెన్షన్ ఏస్ధాయిలో పెరిగిపోతోందో అర్ధమవుతోంది. చంద్రబాబు చెప్పినమాటలు పార్టీ నేతలతో పాటు జనాల్లో కూడా రాంగ్ సిగ్నల్ ను పంపేసింది. ఇక పార్టీ సమావేశంలో మాట్లాడుతు పార్టీకి రాబోయే ఎన్నికలే చివరివి అంటు పదేపదే చెప్పారు. నరేంద్రమోడీ విశాఖ పర్యటన తర్వాతే చంద్రబాబులో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది.



పార్టీకి చివరి ఎన్నికలనే మాటలు చెప్పి తమ్ముళ్ళందరిని భయపెట్టి పనిచేయించుకోవాలని అనుకుంటున్నారా ? లేకపోతే జనాల దగ్గర సింపతి సంపాదించుకుని ఓట్లేయించుకోవాలని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. చంద్రబాబు వ్యూహం ఏదైనా కావచ్చు కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవదని చంద్రబాబుకే అర్దమైపోయిందనే టాక్ మాత్రం జనాల్లో పెరిగిపోతోంది. దీని కారణంగానే చంద్రబాబుకు తనతో పాటు కొడుకు లోకేష్, పార్టీ ఫ్యూచర్ స్పష్టంగా కనబడుతోందనే ప్రచారం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: