కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యంలో మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి. ఎవరూ చూసిన అదే విధంగా పేమెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉండటంతో ఎక్కువ మంది వీటి పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యం లో నగదు రహిత లావాదేవీలకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్‌లు వంటి యూపీఐ యాప్‌ల కు భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది.
ఒక ఖాతా నుంచి మరో ఖాతాలో కి క్షణాల్లో డబ్బులు పంపించుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో యూపీఐ సంస్థలు కూడా తమ సేవలను మరింత విస్తృతి పరిస్తున్నాయి. ఇందులో భాగంగానే యాప్‌లను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో కి తీసుకొస్తున్నాయి. సాధారణంగా ఇంగ్లింష్లో నే యాప్‌లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని తెలిసిందే. అయితే సెట్టింగ్స్ లో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా యూపీఐ యాప్‌లను మీ మాతృ భాషలో కి మార్చుకోవచ్చు. వినియోగదారులు యాప్ ను మరింత సులువుగా వినియోగించుకునేందుకు వీలుగా ఈ సౌకర్యం కల్పించారు. ఫోన్‌పేలో భాషను ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చుద్దాము..
*. ముందుగా మనం ఫోన్ లో ఫోన్ పే యాప్ ను ఓపెన్ చెయ్యాలి.
*. అనంతరం మీ ప్రొఫైల్ ను సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత సెట్టింగ్ లోకి వెళ్లి లాంగ్వేజ్ ఆప్షన్లో కి వెళ్లాలి.
* తర్వాత మీకు నచ్చిన భాష ను సెలక్ట్ చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేయాలి
* దీంతో ఫోన్‌పే సేవల ను తెలుగు, హిందీ, మరాఠీ ఇలా మీకు నచ్చిన భాష లో పొందొచ్చు..
ఈ మధ్య కాలంలో ఎన్నో ఆఫర్స్ , కూపన్ లు భారీ డిస్కౌంట్ లు కూడా అందిన సంగతి తెలిసిందే.. ఇప్పటికీ కూడా ఆ ఆఫర్లు కొనసాగుతున్నాయి.