గోదావరి : గట్టి క్యాండిడేట్ నే రంగంలోకి దించుతున్నారా ?

Vijaya





వచ్చేఎన్నికల్లో వైసీపీ తరపున మండపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గట్టి క్యాండిడేట్ నే  దింపుతున్నారు. తాజాగా జరిగిన మండపేట నియోజకవర్గం సమీక్షలో జగన్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో తోటత్రిమూర్తులు ఎంఎల్ఏ అభ్యర్ధిగా పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. పోటీచేయబోతున్న తోటకు మాజీమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సహకరిస్తే మండపేటలో కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందని జగన్ చెప్పారు.



మండపేటలో ఇఫుడు ఎంఎల్ఏ జోగేశ్వరరావు  టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జోగేశ్వరరావు కూడా   గట్టిఅభ్యర్ధనే చెప్పాలి. ఎందుకంటే 2009, 2014, 19 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇలాంటి బలమైన అభ్యర్ధని ఓడించటమే జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే రామచంద్రాపురంలో నాలుగుసార్లు గెలిచిన ప్రముఖ కాపు నేత తోట త్రిమూర్తులకు మండపేట ఇన్చార్జిగా జగన్ గతంలోనే బాధ్యతలు అప్పగించారు.



జగన్ ఆలోచనల ప్రకారం తోట కూడా రెగ్యులర్ గా మండపేటలోనే తిరుగుతున్నారు. తోట కూడా చాలా బలమైన నేతనే చెప్పాలి. జిల్లాలోని కాపు సామాజికవర్గంలో బలమైన పట్టున్న నేతగా తోట చాలా పాపులర్.  2019 ఎన్నికల్లో టీడీపీకి రాజీనామ చేసిన తోట వైసీపీలో చేరారు. వెంటనే ఆయనకు జగన్ ఎంఎల్సీ ఇచ్చి మండపేట ఇన్చార్జిగా నియమించారు.  తోటన్న, బోసన్న ఇద్దరు కలిసి గట్టిగా పనిచేస్తే గెలుపు ఖాయమని జగన్ ఎందుకన్నారు ? ఎందుకంటే వీళ్ళిద్దరికీ అస్సలు పడదు. బోసు బీసీ నేతైతే తోట కాపుల్లో గట్టి పట్టున్న నేత. ఇద్దరిదీ రామచంద్రాపురం నియోజకవర్గమే.



సో బోసుతో ముందుగా మాట్లాడిన తర్వాతే జగన్ ఎంఎల్సీని మండపేట అభ్యర్ధిగా ప్రకటించారని అర్ధమవుతోంది. జగన్ ఉద్దేశ్యంలో బీసీలు, కాపులు కలిస్తే కచ్చితంగా మండపేటలో వైసీపీ గెలుపు ఖాయం. కానీ జిల్లాలో బీసీలు ప్రధానంగా శెట్టిబలిజలకు, కాపులకు బద్ధ విరోధముంది. మరి నేతలు కలిసినంత మాత్రాన ప్రజలంతా కలిసిపోతారా ? సరే రిజల్టు ఎలాగుంటుదన్నది పక్కన పెట్టేస్తే తోట త్రిమూర్తులు మాత్రం బలమైన అభ్యర్ధనటంలో సందేహంలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: