జగనన్న... "టార్గెట్" కు మిగిలింది తక్కువ కాలమే !
కానీ జగన్ అనుకున్న విధంగా జరగడం అంత సులభం కాదు. ఒకవేళ మొత్తం సీట్లు వైసీపీకి రావాలంటే, ఏకంగా ఏదైనా అద్భుతం జరగాలి లేదా వైసీపీ పాలన లో ప్రతిపక్షాలు కానీ లేదా ప్రజలు కానీ ఒక్క నెగటివ్ పాయింట్ కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇవి రెండూ జరగడానికి మార్గమే లేదు.. అందుకే ఇక జగన్ 175 ఎమ్మెల్యే సీట్ల గురించి మరిచిపోవాలి. దానికి బదులుగా గత ఎన్నికల్లో గెలిచిన 151 చోట్ల గెలవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే గత ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏపీలో లేవు. అప్పార్ట్లో వైసీపీ ఒక కొత్త పార్టీ మరియు జగన్ మీద సానుభూతి కూడా వర్క్ అవుట్ అయింది. కానీ ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది.
మూడున్నరేళ్ల వైసీపీ అధికార కాలంలో చాలా వరకు కొన్ని పొరపాట్ల కారణంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది పార్టీ. ఆలా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో సగానికి పైగా వైసీపీపై వ్యతిరేకత నెలకొంది. ఈ వ్యతిరేకతను కొంతవరకు అయినా పోగొట్టుకోవాలి అంటే మిగిలిన ఈ ఒకటిన్నర సంవత్సరంలో ప్రజలకు నచ్చే అంశాలపై దృష్టిని పెట్టాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. మరి జగన్ ఈ అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎటువంటి జాగ్రత్తలు, వ్యూహాలు అమలు పరచనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.