దీపావళికి క్రాకర్స్ కాలిస్తే అక్కడ జైలుకు వెళ్ళాల్సిందే..?
కాలుష్యాన్ని తగ్గించడానికి దిల్లీ సర్కార్ ఎన్నో చర్యలు చేపడుతోంది. అయినా ఎయిర్ పొల్యూషన్ దారికి రావడం లేదు. ముఖ్యంగా పండుగల సమయంలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ప్రధానంగా దీపావళి రోజున పొల్యూషన్ పీక్ కి వెళ్తోంది.
అందుకే దీపావళి రోజున అధికారులు, దిల్లీ ప్రభుత్వం కాలుష్యం పెరగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆ చర్యలు చేపట్టేందుకు దిల్లీ ప్రభుత్వం రెడీ అయింది..
దీపావళితో సహా వచ్చే ఏడాది ఒకటో తేదీ వరకు అన్ని రకాల బాణాసంచా ఉత్పత్తి, అమ్మకాలు, విక్రయాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ సెప్టెంబర్‌లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్లీ కాలుష్యం నేపథ్యంలో ఆ సర్కారు గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. ఈ నెల 21న ‘దియే జలావో.. పటాఖే నహీ’ (దివ్వెలు వెలిగించండి.. టపాసులు కాదు) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.