మరో ఫీచర్ ను తీసుకొచ్చిన ట్విట్టర్..ఒకే ట్వీట్ లో మూడు..

Satvika
ట్విట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లో ఇది కూడా ఒకటి..ఎక్కువగా సినీ,రాజకీయ నేతలు ట్విట్టర్ ను ఎక్కువగా వాడటం తో దీని పాపులారిటీ మరింత పెరిగింది. వాళ్ళ ప్రైవసీ కి ఎటువంటి భంగం కలగకుండా కొత్త ఫీచర్స్ ను తీసుకు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో టాప్‌ సెలబ్రిటీలు ట్విట్టర్‌ ను ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే ఫీచర్లే ట్విట్టర్‌కు ఇంతటి క్రేజ్‌ను తీసుకొచ్చిందని చెప్పాలి. ఇప్పటికే పలు ఆసక్తికరమైన ఫీచర్స్‌ ను యూజర్ల ను అట్రాక్ట్‌ చేస్తూ వచ్చిన ట్విట్టర్‌ తాజాగా మరో ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఇప్పటి వరకు వరకు ట్వీట్‌ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్‌ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్‌ చేయొచ్చు. వీడియోలు, ఇమేజ్‌లు, జిఫ్‌ ఫైల్‌.. ఇలా ఒకే ట్వీట్‌లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విట్టర్‌ తీసుకొస్తోంది. ఈ మూడింటినీ కలిపి ఒకే ట్వీట్‌ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్ల కోసం ట్విట్టర్‌ ఈ అవకాశాన్ని అందించింది. దీంతో యూజర్లు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని మరింత స్పష్టం గా ట్వీట్‌ చేయొచ్చని ట్విట్టర్‌ చెబుతోంది. ఈ ఫీచర్‌ ను ఇప్పటికే అందుబాటులో కి తీసుకొచ్చారు.

ఇక ట్వీట్‌ చేసేప్పుడు 140 అక్షరాలుగా ఉన్న లిమిట్‌ను తాజాగా 280కి పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ తో వీడియోలు, జిఫ్‌, ఇమేజ్‌ల ను ఒకేచోట చేర్చడం ద్వారా యూజర్లకు మరింత బెటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందని తెలిపారు. ఇక ఈ ఫీచర్‌తో గరిష్ఠంగా ఏవైనా నాలుగు ఫైల్స్‌ను అప్‌లోడ్‌చేసే వీలుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ ఉంది. ఫొటోను, వీడియోను ఒకే పోస్ట్‌లో పోస్ట్‌ చేసే వీలుంది..ఇది  అందరికి ఉపయోగ పడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: