అమరావతి : చివరకు ఎవరికీ కాకుండా పోతారా ?

Vijaya






ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు పరిస్ధితి విచిత్రంగా తయారైపోతోంది. ఈమధ్యనే హర్యానాలో జరిగిన మాజీ ఉపప్రధానమంత్రి  దేవాలాల్ జయంతి ఉత్సవాలకు చంద్రబాబు డుమ్మాకొట్టారు. దేవీలాల్ జయంతి సందర్భంగా ఆయన పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ), ఆయన వారసులు కలిపి పెద్దఎత్తున జయంతిని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేకత పార్టీలు, నేతల్లో చామందిని పిలిచారు. అయితే ఆ కార్యక్రమానికి మమతాబెనర్జీ, కేసీయార్ తో పాటు చంద్రబాబు కూడా గైర్హాజరయ్యారు.




ఆ కార్యక్రమానికి మమతాబెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్, కేజ్రీవాల్, కేసీయార్ లాంటి అనేక మందిని పిలిచారు. పనిలోపనిగా చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానించినట్లు స్వయంగా చౌతాలాయే చెప్పారు. నాన్ ఎన్డీయే, నాన్ బీజేపీ నేతల్లో చాలామంది ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు కూడా చౌతాలా ప్రకటించారు. మరంతటి కీలకమైన మీటింగుకు చంద్రబాబు హాజరవుతారా ? కారా అని చాలామంది అనుకున్నారు. బీజేపీ వ్యతిరేకులందరినీ పిలుస్తున్నట్లు చెప్పిన చౌతాలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు.



జగన్ పేరును ప్రస్తావించకపోయినా చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు పర్టిక్యులర్ గా చెప్పారు. అంటే మోడీ వ్యతిరేక బ్యాచ్ లో చంద్రబాబు ఉన్నారని చౌతాలా అనుకుంటున్నట్లున్నారు.  అయితే చౌతానాను చంద్రబాబు తీవ్ర నిరాసపరిచారు. 2019లో ఘోరఓటమి తర్వాత ఇప్పటివరకు మోడీ లేదా బీజేపీ వ్యతిరేకంగా చంద్రబాబు నోరిప్పితే ఒట్టు. కేసుల భయంతోనే నరేంద్రమోడీకి జగన్ సరెండర్ అయిపోయారని పదేపదే చెబుతున్న చంద్రబాబు మరి తానెందుకు నోరిప్పటం లేదో మాత్రం సమాధానం చెప్పటంలేదు.




గతంలో కూడా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా మమత, శరద్ పవార్ లాంటి వాళ్ళు మీటింగులు పెట్టారు. మొదట్లో ఆ మీటింగులకు చంద్రబాబును ఆహ్వానించినా వెళ్ళలేదు. దాంతో వాళ్ళు చంద్రబాబును ఆహ్వానించటం మానుకున్నారు. ఇటువైపు ఎన్డీయే పార్టీలు చంద్రబాబును పట్టించుకోవటంలేదు. ఇదే సమయంలో నాన్ ఎన్డీయే పార్టీలు కూడా చంద్రబాబును దూరంగా ఉంచుతున్నాయి. జరుగుతున్నదిచూస్తుంటే రెంటికి చెడ్డరేవడిగా చంద్రబాబు అయిపోయారేమో అని అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: