అమరావతి: చంద్రబాబుకే దిక్కుతోచటం లేదా ?

Vijaya






ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని భుజాలు చరుచుకునే  చంద్రబాబునాయుడుకే పరిస్ధితులు ఎదురు తిరిగినట్లున్నాయి. ఒకవైపు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన బ్రహ్మాండమైన విజయం సాదించింది. మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన విషయంలో ఏదో చేద్దామని అనుకుంటే చివరకు ఇంకేదో అవుతోంది. పేరు మార్పిడి రాజకీయాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆకాశానికి చిల్లు పెడదామని చంద్రబాబు ప్రయత్నిస్తే ఏమీ జరగలేదు.



పార్టీలోని నేతలు కూడా పెద్దగా సహకరించలేదు. ఎన్టీయార్ పేరును జగన్మోహన్ రెడ్డి తీసేసి అవమానించారనే కాసేపు అనుకుందాం. మరి ఎన్టీయార్ కు తాను, ఎన్టీయార్ వారసులంతా కలిసి ఎల్లోమీడియా సాయంతో చేసిందేమిటి ? అనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. కుటుంబసభ్యుల సాయంతో ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటుపొడిచి ముఖ్యమంత్రి పదవిని లాగేసుకోవటం, పార్టీ అద్యక్షుడిగా తొలగించటం, పార్టీని కబ్జాచేయటం, చివరకు ఎన్టీయార్ మానసిక క్షోభతో చనిపోవటానికి కారణమవటం అందరికీ తెలిసిందే.



ఇవన్నీ ఒకఎత్తైతే హోటల్ దగ్గరకు వచ్చిన ఎన్టీయార్ ని చెప్పులతో కొట్టించటాన్ని జనాలంతా కళ్ళప్పగించి చూశారు. తాను నమ్మిన జనాలతోనే చంద్రబాబు, దగ్గుబాటి, కుటుంబసభ్యులంతా కలిసి తనను నడివీధిలో  చెప్పులతో కొట్టించారన్నదే ఎన్టీయార్ ను మానసికంగా బాగా కుంగదీసేసింది. ఆ క్షోభతోనే ఎన్టీయార్ చివరకు చనిపోయారు. దీన్ని చంద్రబాబు, దగ్గుబాటి, కుటుంసభ్యులు ఎవరు కాదనలేకపోతున్నారు. ఇక్కడే ఎన్టీయార్ ను ఎవరు అవమానించారు అనే పాయింట్ దగ్గరే అందరు దొరికిపోయారు. పైగా అప్పటి వీడియోలు ఇపుడు వైరలవుతున్నాయి. 



మంత్రులు పదేపదే ఇదే విషయాన్ని బలంగా చెబుతుంటే చంద్రబాబు, దగ్గుబాటి, వారసులు ఎవరూ కాదనలేకపోతున్నారు. ఈ పాయింటులోనే చంద్రబాబు పూర్తిగా వీకైపోయారు. ఇదే సమయంలో జూనియర్ ను తమ్ముళ్ళు బాగా కెలకటంతో జూనియర్ అభిమానులు కూడా ఎదురుదాడులకు దిగుతున్నారు. అంటే పార్టీ నేతల నుండి సహకారం అందక, వారసులు, కుటుంబసభ్యులు సమాధానాలు చెప్పుకోలేక, మామూలు జనాలూ పట్టించుకోకపోవటంతో ఏమి చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: