పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..!!

Satvika
ఈపీఎఫ్‌వో పీఎఫ్ అకౌంట్ దారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు కొత్త సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి చాలా ప్రయోజనం కలుగనుంది.. ప్రావిడెంట్ ఫండ్ తన ప్రస్తుత సేవలకు మళ్లీ అదనంగా హెల్త్ కేర్, మెటర్నిటీ, డిసెబిలిటీ బెనిఫిట్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. పెన్షన్ సేవలకు అదనంగా వీటిని అందించాలని ప్రణాళికలను చేస్తుంది.ఈ అంశానికి సంబంధించి ప్రాథమిక ప్రతిపాదనను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభం అయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈపీఎఫ్‌వో కు సామాజిక భద్రతా స్కీమ్స్‌కు అమలు చేయడంలో అపారమైన అనుభవం ఉంది..ఎస్‌పీఎఫ్ అనేది జాతీయ స్థాయిలోని బేసిక్ సోషల్ సెక్యూరిటీ గ్యారంటీ పథకం. పేదరికం నిర్మూలన, వివక్ష లేకుండా చూడటం, సామాజిక బహిష్కరణ లేకుండా చూడటం, అత్యవసర వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, బేసిక్ ఇన్‌కమ్ సెక్యూరిటీ వంటి వాటి లక్ష్యంగా దీన్ని అమలు చేయనున్నారు..ఇలాంటి పథకాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటు లో ఉండేలా చూడటం మంచిదని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అభిప్రాయపడింది. దీని కోసం జాతీయ చట్టాలను సవరించాలని సూచించింది. అందుకే ఈపీఎఫ్‌వో కూడా ఈ పథకాన్నిఅమలు చేయాలని రెడీ అవుతోంది. చాలా మందికి ఊరట లభించే అవకాశం ఉంటుంది.. 45 కోట్ల మంది వర్కర్లు కు ఈ ప్రయోజనాల ను అందుబాటు లోకి తీసుకురావాలని ఈపీఎఫ్‌వో భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో 90 శాతం మంది అసంఘటిత రంగానికి చెందిన వారే ఉండనున్నారు.వచ్చే కొన్ని నెల్లలో ఈపీఎఫ్‌వో ఈ అంశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈపీఎఫ్‌వో అనేది దీర్ఘకాల లక్ష్యం తో పని చేసుకుంటూ ముందుకు వెళుతుంది.. భవిష్యత్ లో మరిన్ని బెనిఫిట్స్ ను అందించనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: