హైదరాబాద్ : ఇదే కేసీయార్ కు అతిపెద్ద సమస్యా ?

Vijaya







మునుగోడు ఉపఎన్నికలో గెలుపు సంగతి దేవుడెరుగు అసలు అభ్యర్ధి ఎంపికే కేసీయార్ కు అతిపెద్ద సమస్యగా మారింది. ఉపఎన్నికలో అభ్యర్ధిగా మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని దింపాలన్నది కేసీయార్ ఆలోచన. అయితే కూసుకుంట్లపై  పార్టీలోనే చాలా వ్యతిరేకత వచ్చేసింది. మంత్రి జగదీశ్ రెడ్డి మాటనే కాదు చివరకు కేసీయార్ మాటను కూడా సుమారు 40 మంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.





నిన్నటివరకు వ్యతిరేకించిన వాళ్ళంతా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటి ఛైర్మన్లతో పాటు సర్పంచులు కూడా ఉన్నారు. వీళ్ళనే ఎలా ఒప్పించాలో తెలీక కేసీయార్ నానా అవస్తలుపడుతుంటే మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ మాట్లాడుతు ఉపఎన్నిక పోటీచేసే అవకాశం బీసీ నేతకే ఇవ్వాలంటు డిమాండ్ చేశారు. ఎప్పుడైతే మాజీఎంపీ డిమాండ్ చేశారో వెంటనే బీసీ సంఘాలు కూడా ఇదే డిమాండ్ అందుకున్నాయి.





ఇదే సమయంలో తానే అభ్యర్ధినని చెప్పి కూసుకుంట్ల నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు. కేసీయార్ మనసులోనేమో కూసుకుంట్లున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో ఏమో బీసీ నేతకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరిగిపోతోంది. వీళ్ళకు తోడు బీసీ సంఘాలు కూడా డిమాండ్లు మొదలుపెట్టేశాయి. మాజీ ఎంపీ లెక్కప్రకారం నియోజకవర్గంలో 67 శాతం బీసీలున్నారట. గడచిన 12 ఎన్నికల్లో రెడ్లు, వెలమలు మాత్రమే ఎంఎల్ఏగా ఎన్నికయ్యారట. కాబట్టి ఇపుడైనా బీసీకి టికెట్ ఇవ్వాలన్నది మాజీఎంపీ డిమాండ్.





బీజేపీ నుండి ఎలాగూ రాజగోపాలరెడ్డే అభ్యర్ధిగా ఉంటారు. టీఆర్ఎస్ నుండి రెడ్డా లేకపోతే బీసీనా అనేది తేలటంలేదు. కేసీయార్ ఇష్టప్రకారమే అయితే కూసుకుంట్లే అభ్యర్ధయ్యే అవకాశముంది.  ఇక కాంగ్రెస్ సీనియర్లలో కూడా అభ్యర్ధి విషయంలో చర్చలమీద చర్చలు జరుగుతున్నాయి. చూడబోతే బీసీ అభ్యర్ధికే టికెట్ దక్కే అవకాశముంది. ఇదే జరిగిగే నియోజకరవ్గంలోని బీసీల ఓట్లు ఎవరికి పడతాయనేది సస్పెన్సుగా మారింది. బీసీ అభ్యర్ధికే ఓట్లేయాలని సంఘాలు గట్టిగా అనుకుంటే టీఆర్ఎస్-బీజేపీలకు షాక్ తప్పదనే అనిపిస్తోంది. మరి అన్నీపార్టీల తరపున ఎవరు రంగంలో ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: