అమరావతి : ప్రభుత్వం ఎల్లోమీడియా ట్రాపులో పడిందా ?
అక్షరాల అలాంటి అనుమానమానాలే పెరిగిపోతున్నాయి. మంత్రులు లేదా జగన్మోహన్ రెడ్డి మీడియా పొద్దునలేస్తే రాత్రి పడుకునేవరకు రామోజీరావు నామస్మరణే చేస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియాలో వార్తలు, కథనాలను ఉద్దేశ్యపూర్వకంగానే అచ్చవుతున్నాయి. చంద్రబాబునాయుడు కాకుండా ప్రభుత్వంలో ఇంకెవరున్నా ఎల్లోమీడియా తట్టుకోలేందన్న విషయం ప్రపంచానికంతా తెలుసు. తమ ఆటలు ఇష్టంవచ్చినట్లు సాగాలంటే వాళ్ళకి చంద్రబాబే సీఎంకుర్చీలో ఉండాలి.
జగన్ సీఎం అయిన తర్వాత వాళ్ళ ఆటలకు బ్రేకులు పడ్డాయి. పైగా చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకు, ఎన్నికల్లో మళ్ళీ గెలిపించేందుకు 2019 ఎన్నికల్లో ఎంత ప్రయత్నించినా జనాలు పట్టించుకోకుండా వైసీపీని అఖండ మెజారిటితో గెలిపించారు. దాంతో జనాలన్నా, జగన్ అన్నా మంటమొదలైంది. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందో లేదో కూడా అనుమానంగానే ఉంది. అందుకనే జగన్ పై వీలైనంత బురదచల్లేస్తే జనాల్లో కొందరన్నా నమ్మితే అలాంటి వాళ్ళు టీడీపీకి ఓట్లేస్తారు కదాన్నది ఎల్లోమీడియా ప్లాన్.
ఇదే సమయంలో జనాల్లో ఎల్లోమీడియా విశ్వసనీయతపైన జగన్ దెబ్బకొట్టార్న మంటకూడా బలంగా ఉంది. అందుకనే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కథనాలు, వార్తలు అచ్చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వచ్చేందుకు ఒక వ్యూహం ప్రకారం కథనాలు రాస్తున్నారు. ఈ విషయాలు జగన్+మంత్రులకు బాగా తెలుసు. తెలిసీ ఎల్లోమీడియాలో వచ్చే వార్తలు తప్పంటు మీడియా సమావేశాలు పెట్టి నానా గోలచేస్తున్నారు. ప్రభుత్వం ఏమిచేస్తోందో జనాలకు తెలుసు. తమ అంచనాలమేరకు పనిచేయటంలేదని అనుకుంటే జనాలే జగన్ను ఓడిస్తారు.
జనాలనే నమ్ముకున్నానని జగన్ చెప్పిందే నిజమైతే మరి ఎల్లోమీడియాలో వచ్చే వార్తలగురించి ఎందుకు పట్టించుకుంటున్నట్లు ? చంద్రబాబును సీఎంగా కంటిన్యు చేయించటంలో విఫలమైన ఎల్లోమీడియా జగన్ను ఓడించగలదా ? జనాలు అనుకుంటేనే ఎవరైనా అధికారంలోకి రాగలరన్న మాట వాస్తవం. మరింతోటిదానికి ఎల్లోమీడియాకు జగన్+మంత్రులు+జగన్ మీడియా ఎందుకింత ప్రచారం కల్పిస్తున్నట్లు ? పొద్దునలేచింది మొదలు ఎల్లోమీడియా గురించేనా గోలంతా? చూస్తుంటే ఎల్లోమీడియా ట్రాపులో ప్రభుత్వం పడిపోయిందనే అనిపిస్తోంది.