దారుణం..బాలింతలను పరుగులు పెట్టించిన అధికారులు..

Satvika
గర్భిణీలను ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు వాపొతున్నారు.తెలంగాణలో మరీ దారుణంగా ప్రవర్థిస్తున్నారు..ఆసుపత్రిలో పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పాలి.మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి ఒడ్డున నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వరద ముంపు పొంచి ఉండటంతో మంగళవారం రాత్రి గర్భిణులు, బాలింతలు పరుగులు పెట్టాల్సివచ్చింది.



ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరుతున్న వరద మీరు కారణంగా గత నాలుగు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు వదులుతున్నారు. ఇదే నేపథ్యం లో మంగళవారం రాత్రి 43 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటం తో ఆసుపత్రికి సమీపం నుంచే వరద ప్రవాహం వెళ్తుండగా ఆలస్యంగా మేలుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రి లోని వారందరినీ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రక్కన జోరు గా వర్షం కురుస్తుంటే గర్భిణీలు, బాలింతలు పరుగులు తీయగా, ఆపరేషన్ అయి ఒక రోజు కూడా గడవని బాలింతలను తరలిస్తుండగా కుట్ల వద్ద రక్తస్రావమైన దృశ్యాలు అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. అంబులెన్సులు సరిపోక ఆటోలలో తరలించారు.



వరద ముప్పుతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జనరల్ ఆసుపత్రికి చేరిన గర్భిణులు, బాలింతల కు ఆసుపత్రి సమస్యల తో స్వాగతం పలికింది. 120 మంది కి పైగా జనరల్ ఆసుపత్రికి వచ్చిన వారికి సరిపోను బెడ్ల వసతి లేకపోవడం తో నవార్ పట్టీల తో కూడిన మంచాలే దిక్కయ్యాయి. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యం లో మరిన్ని గేట్లు ఎత్తివేస్తే ఆసుపత్రి నీటమునిగే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి నిర్మాణ క్రమంలోనే దిశలో గోదావరి ఒడ్డున ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే జరిగే అనర్థాల గురించి ప్రచురించడంతో పాటు ఇటీవల వెలు వరించిన కథనంలో దిశ ముందస్తు హెచ్చరికలను చేసినప్పటికీ అధికారులు నిద్రావస్థ లో ఉండి పోయారు..అధికారుల పరిస్థితి వల్ల జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: