
వారెవ్వా.. నాలుగు గంటల్లో వంతెన నిర్మాణం?
సాధారణంగా కేవలం చైనా మాత్రమే కేవలం రోజుల వ్యవధిలో హాస్పిటల్స్ నిర్మించడం వంతెనలు కట్టడం సాధ్యం అవుతుంది అని చెబుతూ వుంటారు చాలామంది. ఇప్పటివరకు ఇలా చైనాలో ఎన్నో అసాధ్యమైన నిర్మాణాలను సాధ్యం అని చూపించింది చైనా. ఇప్పుడు భారత సైనికులు కూడా ఇలా రోజుల వ్యవధిలో కాదు కేవలం గంటల వ్యవధిలోనే ఒక వంతెన నిర్మాణం చేపట్టటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా కేవలం నాలుగు గంటల్లో భారత సైనికులు వంతెన నిర్మాణం చేపట్టిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
కరోనా వైరస్ కారణంగా దాదాపు రెండేళ్లుగా అమర్నాథ్ యాత్రకు భక్తుల అనుమతి లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే కానీ రెండేళ్ల తర్వాత ఎంతో ఘనంగా అమర్నాథ్ యాత్రను ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అమర్నాథ్ యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎందుకు అట్లా సైనికులు కూడా బాసటగా నిలుస్తున్నారు అని చెప్పాలి. ఇందులో భాగంగా కొండచరియలు విరిగి కొట్టుకుపోయిన వంతెనను కేవలం నాలుగు గంటల్లోనే పునరుద్ధరించారు సైనికులు. ఇటీవలే అమర్నాథ్ యాత్ర మార్గంలోని బల్తాల్ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీ మాత ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది. వంతెన కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తించిన జవాన్లు వెంటనే పునరుద్ధరించారు.