టోబాకో ఫ్రీ జోన్ గా మరో ఆలయం..ఉల్లంఘిస్తే మూల్యం చెల్లించాల్సిందే..

Satvika
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే..ఈ విషయం ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా జనాలు ఏది పెడ చెవిన కూడా పెట్టరు.. దూమపానం మనిషిని రోజు రోజుకు తినెస్తుంది. క్యాన్సర్‌ను కూడా తీసుకు వస్తుంది.దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే డబ్బులిచ్చి జబ్బులను తెచ్చుకోవడం అని..అందుకే కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో పొగ తాగడం పూర్తిగా నిషెదించిన సంగతి తెలిసిందే..కొన్ని రూల్స్ కూడా పెట్టారు. వాటిని పక్కన పెడితే భారీ మూల్యాన్ని తప్పక చెల్లించుకోవాలి..


ఏపీ లోని ప్రముఖ ఆలయాలలో ఈ నిభంధన ఉంది..ఇప్పటికే కొన్ని ఆలయాలలొ వున్నా కూడా జనాల తీరు మాత్రం మారలేదు. ఇప్పుడు మరో ఆలయ ప్రాంగణం పొగాకు నిషేధిత ప్రాంతంగా మారిపోయింది. ఇప్పటికే తిరుమల ఆలయాన్ని టొబాకో ఫ్రీ జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం తాజాగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ పరిసరాలను కూడా పొగాకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది.ఈ నెల 26 నుంచి అమల్లోకి రావున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు శనివారం ఆలయ పరిసరాల్లోనే ప్రకటించారు. ఈ నిషేధం ప్రకారం ఆలయ మెట్ల మార్గం నుంచి కొండ పై భాగం వరకు పొగాకు ఉత్పత్తుల వినియోగంతో పాటు విక్రయాలు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.


ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించే వారిపై కనిష్టంగా రూ.20 నుంచి గరిష్టంగా రూ.200 వరకు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు కూడా దీని పై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.. పవిత్రమైన ఇలాంటి ప్రాంతాల ల్లో జనాలు ఇతరులకు హాని కలిగించ వద్దని ఆలయ అధికారులు అంటున్నారు.. ఇప్పటికే ప్రముఖ ఆలయాల కు ఈ నిబంధన కొనసాగుతుంది..ఏపీ సర్కార్ కూడా ఈ విషయం పై సీరియస్ గా ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: