తన వాకింగ్ కోసం రోడ్డు మూయించిన ఐఏఎస్!

Purushottham Vinay
ఇక మొన్నటికి మొన్న ఢిల్లీకి చెందిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వాడ్.. ఆయన సతీమణిని తీసుకొని కుక్కతో కలిసి వాకింగ్ చేయటం కోసం స్టేడియంకు వెళ్లటం ఇంకా వారిద్దరు వస్తున్నారని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వారిని గ్రౌండ్ నుంచి బయటకు పంపటం పెను దుమారాన్ని రేపింది. దీంతో స్పందించిన కేంద్ర హోంశాఖ వారిపై తగిన చర్యల్ని చేపట్టింది. భర్తను లద్దాఖ్ కు ఇంకా భార్యను అరుణచల్ ప్రదేశ్ కు ట్రాన్స్ ఫర్ చేసి ఓవరాక్షన్ చేసిన వారికి ఇబ్బందులు తప్పవన్న స్పష్టమైన సంకేతాన్ని కూడా ఇచ్చింది.అయినప్పటికీ కొందరిలో మాత్రం పవర్ తాలూకు పొగరు ఏమాత్రం తగ్గలేదన్న విషయం తాజాగా మళ్ళీ వెలుగు చూసిన ఉదంతం మరోసారి స్పష్టం చేసింది.ఇక కేరళలోని కొచ్చిలోనూ ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఒక ఐపీఎస్ అధికారి అయితే తాను వాకింగ్ చేసుకోవటం కోసం పొద్దుపొద్దున్నే రోడ్డును గంటల తరబడి బ్లాక్ చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.ఇక కొచ్చిలోని క్వీన్ వాక్ వే చాలా ప్రత్యేకమని చెప్పాలి.


ఉదయాన్నే అక్కడ వాకింగ్ చేయటం కోసం ఇంకా జాగింగ్ చేయటం కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చిన్నారులు సైక్లింగ్ ఇంకా స్కేటింగ్ చేసేందుకు వీలుగా ఆ రోడ్డును ట్రాఫిక్ కు మూసేయటం జరుగుతుంది. ఇది అందరి కోసం కావటంతో ఇలాంటి నిర్ణయం ఎవరి మీదా ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. కానీ ఇటీవల.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్ వెస్ట్) వినోద్ పిళ్లై మార్నింగ్ వాక్ చేయటం కోసం స్థానిక అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది.ఆయన గారు వాకింగ్ చేసేందుకు వీలుగా రోడ్డు మీద బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఆ ట్రాఫిక్ ను పక్కదారి పట్టిస్తున్న వైనం అనేది వెలుగు చూసింది. దీంతో.. వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న వినోద్ వాకింగ్ కారణంగా.. అక్కడ దాదాపు మూడు గంటలకు పైనే మూసేసి ఉండటం ఇంకా అలాగే వారం మొత్తం ఇదే పరిస్థితి ఉండటంపై బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి.. దీనిపై ప్రభుత్వం ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

IAS

సంబంధిత వార్తలు: