చార్మినార్ వద్ద టెన్షన్..టెన్షన్..భారీగా పోలీసుల మోహరింపు..
హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, యూపీ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా ఏర్పడ్డారు.. బీజెపి నేతలు ఈ విషయం పై వివరణ ఇవ్వాలని కొందరు ముస్లిం ప్రముఖులు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు.. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ లో నమాజ్ తర్వాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహ్మద్ ప్రవక్త పై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యల పై బీజేపీకి వ్యతిరేకం గా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకూ పెద్ద సంఖ్య లో చేరుకొని ర్యాలీలు చేసారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకం గా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యం లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.. హైదరాబాద్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను దించారు. హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..ఇప్పటికే ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ముస్లిం సోదరులు ఒక్కసారి కన్నెర్ర చేశారు.. తమకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అనేక చర్చలకు దారి తీసిన ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతూందో చూడాలి..