కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

Purushottham Vinay
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్ ఇంకా డియర్‌నెస్ రిలీఫ్ పెంచుతుంది.ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో ఓసారి ఉద్యోగులకు ఇంకా పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెరుగుతుంది. 2022 జనవరి నెలకి సంబంధించిన డీఏను కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే.అలాగే కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడంతో ఉద్యోగులకు ప్రస్తుత 34 శాతం డీఏ లభిస్తోంది. ఇక ఉద్యోగులకు జూలై నెలలో మరోసారి డీఏ పెరగనుంది. జూలై 1 వ తేదీన డీఏ పెంపు ప్రకటన రావొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా డీఏ ఎంత పెంచాలో డిసైడ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) 2022 మార్చి నెలలో విడుదలైంది. AICPI ఇండెక్స్ ప్రకారం జూలై నెలలో 4 శాతం డీఏ పెరగొచ్చని అంచనా.


ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏకు గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉద్యోగులకు 38 శాతం డీఏ లభించనుంది. ఈ లెక్కన ఉద్యోగులకు 4 శాతం వేతనం అనేది పెరగుతుంది.అలాగే కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచితే రూ.56,900 బేసిక్ వేతనం ఉన్నవారికి 38 శాతం డీఏ చొప్పున రూ.21,622 డీఏ అనేది లభిస్తుంది. ఇప్పుడు 34 శాతం చొప్పున రూ.19,346 డీఏ లభిస్తుంది. 4 శాతం డీఏ గనుక పెరిగితే అదనంగా రూ.2,276 వేతనం లభించనుంది. ఉద్యోగులకు వార్షికంగా రూ.27,312 ప్రయోజనం అనేది లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం కనుక తీసుకుంటే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా 65 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది. అయితే పలు కారణాల వల్ల డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక్కోసారి ఆలస్యం కూడా జరుగుతుంది. మరి ఈసారి జూలై 1 వ తేదీన డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: