ఇవి తెలుసుకోపోతే మీ అకౌంట్లో మొత్తం డబ్బు మాయం!

Purushottham Vinay
ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, వంటి మోసపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున పబ్లిక్ పరికరాలు ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండటం మంచిది. పేరున్న, ధృవీకరించిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. విశ్వసనీయ వెబ్‌సైట్‌లు తరచుగా ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలకు ఎక్కువ స్థాయి రక్షణను అందిస్తాయి.కొంతమంది అత్యవసర పరిస్థితులలో వేరే వాళ్ళ కంప్యూటర్ ద్వారా ఇంకా అలాగే పబ్లిక్ వై-ఫై ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో సమాచారం దొంగిలించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు తొందరలో ఉన్నప్పటికీ, పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ వాడిగానీ ఇంకా పబ్లిక్ కంప్యూటర్ నుంచి గానీ నగదు రహిత లావాదేవీలు చేయకూడదు. అలాగే బిల్లు చెల్లింపులకు ముఖ్యంగా హోటళ్లు, విమానాశ్రయ లాంజ్‌లు ఇంకా అలాగే షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి ప్రదేశాలలో బిల్లు చెల్లింపుల కోసం పబ్లిక్ వై-ఫైని ఎక్కువగా వినియోగిస్తుంటారు.




ఇలాంటి చోట బిల్లు చెల్లింపులకు ఖచ్చితంగా మీ మొబైల్ నెట్‌వర్కనే ఉపయోగించాలి. ఇతర ఆర్థిక లావాదేవీల కోసం మీ వ్యక్తిగత కంప్యూటర్ ఇంకా అలాగే మీ వ్యక్తిగత వై-ఫై లను మాత్రమే వాడాలి.అలాగే కొన్ని యాప్‌లు మీ మొబైల్‌లో ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ కావచ్చు. అటువంటి యాప్‌లను గమనించి వెంటనే అన్ఇన్‌స్టాల్ చేయండి. అలాగే, ఏదైనా యాప్‌ను మీ డివైజ్‌కి డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేసేముందు వాటిని నమ్మకమైన కంపెనీలు రూపొందించినవా లేదా అని తెలుసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్ ఇంకా మొబైల్ వాలెట్ యాప్‌లకు కూడా చట్టబద్ధత ఉండాలి. యాప్ స్టోర్‌ ఇంకా ప్లే స్టోర్ వంటి వాటిలో కూడా చట్టవిరుద్ధమైన యాప్‌లు ఉండే అవకాశం ఉంది. అందువల్ల సమీక్షకులు ఇచ్చే రివ్యూలను జాగ్రత్తగా పరిశీలించండి. తక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్‌లు ఉన్న యాప్‌ల జోలికి అస్సలు పోకండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉందని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే వాటిని డౌన్‌లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: