టీఆరెస్ కౌన్సిలర్ దారుణ హత్య... కత్తులతో వీరంగం

VAMSI
రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రాను రాను దిగజారి పోతున్నాయి అనటానికి ఉదాహరణగా తాజాగా మహబూబాబాద్‌లోని వార్డు కౌన్సిలర్ అయిన బానోతు రవినాయక్ ను దారుణంగా హత్య చేశారు. ఈ గురువారం ఉదయం 11 గంటల సమయంలోనే పట్టణంలో గల పత్తిపాక ప్రాంతంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే పత్తిపాకలో క్రొత్తగా నిర్మించుకుంటున్న తన ఇంటి పనులను చూసుకోవటానికి వెళ్లిన రవినాయక్‌ పైన గుర్తు తెలియని కొంత మంది వ్యక్తులు గొడ్డళ్లతో తనపై విచక్షణారహితంగా దాడికి చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడి జరిగే సమయంలో రవినాయక్ ఒంటరిగా ఉండడం గమనార్హం.

అయితే దాడి చేసిన తరువాత దుండగులు అక్కడ నుండి పరార్ అయిపోయారు. ఇక రవినాయక్‌ను స్థానికులు అక్కడికు దగ్గర లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే రవినాయక్ తన ప్రాణాలు కోల్పోయినట్లుగా డాక్టర్స్ నిర్ధారించారు. ఇక మృతదేహాన్ని ప్రస్తుతం అక్కడే పోస్టుమార్టంకు తరలించారు. అయితే కౌన్సిలర్ రవినాయక్ హత్య వరంగల్ జిల్లాలోనే పెద్ద సంచలనంగా మారింది. బానోతు రవినాయక్ ను కొంత మంది కొద్ది రోజులుగా  నేతలతో కలిసి తీవ్రంగా విభేదిస్తున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా తనకు ప్రాణహాని ఉందని కూడా తానే స్వయంగా కొంత మంది తన సన్నిహితులతో కూడా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే అతను హత్యకు గురికావల్సి రావటం గమనార్హం. ఇక రవినాయక్‌కు భార్య పూజ, అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా రవినాయక్ కు ఇలా జరగటం చాలా బాధాకరం.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీని వెనుక రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయా ఆనంది తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు లొంగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తంపై వివరాలు తెలియాల్సి ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: