అమరావతి : ఎల్లోమీడియాకు పండగే పండగా ?

Vijaya



కొత్త మంత్రివర్గ కూర్పు సందర్భంగా ఎల్లోమీడియాకు చేతినిండా ఫుల్లుగా పని దొరికింది. మంత్రిపదవులు ఆశించి భంగపడిన వారి మద్దతుదారులు ఓ నాలుగైదు నియోజకవర్గాల్లో ఆందోళనలు చేస్తున్నది వాస్తవమే. అయితే అప్పటికి రాష్ట్రమంతా ఏదో భగ్గుమని మండిపోతున్నట్లు ఎల్లోమీడియా బ్యానర్ కథనాలు అందించి తృప్తిపడిపోతోంది. పదే పదే ఆందోళనలను చూపించి రాష్ట్రమంతా ఆందోళనలతో అట్టుడుకిపోతున్నట్లు, వైసీపీలో నిరసన జ్వాలలు ఆకాశానికి అంటుతున్నట్లుగా కలరింగ్ ఇస్తోంది.





మంత్రి పదవులు ఆశించిన వారిలో అది దక్కకపోయేసరికి అసంతృప్తి ఉండటం సహజమే. అంతమాత్రాన వాళ్ళంతా వైసీపీకి రాజీనామాలు చేసి వెంటనే టీడీపీలో చేరిపోయేంత సీన్ లేదు. కానీ ఎల్లోమీడియా ఏమి రాస్తోందంటే అసంతృప్తితో రగిలిపోతున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని థిక్కరిస్తున్నారని, వాళ్ళ ధిక్కారానికి జగన్ బిత్తరపోతున్నారంటు నానా రచ్చ చేస్తోంది. ఎల్లోమీడియా గోల ఎలాగుందంటే అసంతృప్తితో ఉన్న వాళ్ళంతా ఇప్పటికిప్పుడు టీడీపీలో చేరబోతున్నారనేంతగా కలరింగ్ ఇచ్చేస్తోంది.





తన రాతలకు మద్దతుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, కరణం ధర్మశ్రీ లాంటి వాళ్ళని ఉదాహరణలుగా చూపుతోంది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మద్దతుదారులు రగిలిపోతున్నారని, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను అనుచరులు జగన్ పై మండిపోతున్నారంటు పెద్ద హెడ్డింగులు పెట్టి చూపిన వార్తలనే పదే పదే చూపుతోంది. అయితే ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఏమిటంటే అసంతృప్తితో ఉన్నవాళ్ళెవరు వైసీపీని వదిలిపెట్టరు. వైసీపీని వదిలిపెడితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమిటో వాళ్ళకి స్పష్టంగా తెలుసు.






పిన్నెల్లి, బాలినేని, మేకతోటి మద్దతుదారులంతా రాజీనామాలు చేస్తున్నారని వాళ్ళని కూడా రాజీనామాలు చేసేయమని కోరుతున్నారని కథనాలు అచ్చేస్తున్నారు. నిజానికి ఇదంతా టీ కప్పులో తుఫాను లాంటిదని అందరికీ తెలుసు.  ఇప్పటివరకు మద్దతుదారులు గోల చేస్తున్నారే కానీ డైరెక్టుగా ఒక్క ఎంఎల్ఏగాకానీ లేదా ఒక్క మాజీ మంత్రికానీ బహిరంగంగా జగన్ పై తమ అసంతృప్తిని వ్యక్తంచేయకపోవటం గమనార్హం.  తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటమే దీనికి ప్రధాన కారణం. ఈ విషయం జగన్ కు కూడా బాగా తెలుసు. అందుకనే ఏమీ పట్టించుకోవటంలేదు. రెండు రోజులు గోల తర్వాత మద్దతుదారులు కూడా కామ్ అయిపోతారు. ఈ రెండు రోజులు మాత్రం ఎల్లోమీడియాకు పండగే పండగ.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: