ఓరి నాయనో.. గుజరాత్లో కొత్త వేరియంట్?
ప్రస్తుతం రూపాంతరం చెందిన XE అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిందని ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచదేశాలు అప్రమత్తం కావాలి అంటూ హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా చైనా లాంటి దేశాలలో ఈ మహమ్మారి వైరస్ ఎంత విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న అందరినీ భయపెట్టినా ఓమిక్రాన్ కంటే కొత్త వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే భారత్లో కూడా కొత్త వేరియంట్ కు సంబంధించి ఇక అటు కేసు నమోదు కావడం కూడా సంచలనంగా మారిపోయింది. మిగిలిన వేరియంట్ల కంటే పది శాతం ఎక్కువగా విస్తరిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి కరోనా వైరస్ నీడలు కమ్ముకుంటాయా అని అందరూ భయపడిపోతున్నారు అనే చెప్పాలి. అయితే గుజరాత్ లో మార్చి 13 తేదీన వడొదరా పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు చెప్పారు. అయితే కొత్త వేరియంట్ బారినపడిన రోగి మాత్రం కేవలం వారం రోజుల వ్యవధిలోనే కోలుకున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. జినోమిక్ సీక్వెన్స్ లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు. మరోసారి నిర్ధారించుకునేందుకు లాబ్ కి పంపినట్లు చెప్పుకొచ్చారు వైద్యాధికారులు.