ఏపీలో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం ?
అయితే తాజాగా ఈ అంశం పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే... ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని చెప్పడం విశేషంగా మారింది. అంతేకాదు... గిరిజన ప్రాంతాలతోనే ఈ నూతన జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని సమాచారం అని ఆయన అన్నారు. ఇక ఈ విషయం ఇప్పటికే జగన్ దృష్టికి తీసుకెళ్లడం, ప్రణాళిక చెయ్యడం జరిగిందని...అలాగే దాదాపుగా 27వ జిల్లా ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యిందని అంటున్నారు.
అయితే కొత్తగా రాబోతున్న జిల్లా ఎక్కడ అన్న క్రమంలో రంపచోడవరంను కొత్త జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలపై నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే రంపచోడవరంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వారి ఆకాంక్షను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్లు చాలానే వినిపించాయి. అయితే అప్పుడు కొన్ని కారణాల వలన అది జరగలేదు. కానీ ఇప్పుడు 27 జిల్లాగా రంపచోడవరంను ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం అని మంత్రి పర్నెనీ నాని తెలియజేశారు.